Featured

Adusumilli Srinivasarao : ఎన్టీఆర్ కు ఆస్కార్ అవార్డు రాదు… అడ్డుకునేది వీళ్ళే : శ్రీనివాసరావు

Adusumilli Srinivasarao : గత కొన్నిరోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త అందరినీ ఊరిస్తోంది. అదే కొమరం భీముడో పాత్రకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అవ్వబోతున్నాడు అని. హాలీవుడ్ పత్రిక వెరైటీ ప్రచురించిన లిస్ట్ లో ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితా లో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ఉంది. అయితే నిజానికి ఆస్కార్ నామినేషన్స్ లో ఇంకా ఎన్టీఆర్ పేరు ఉందొ లేదో కానీ ఆ లిస్ట్ లో ఉండే అవకాశం ఉందనగానే ఇక్కడ వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందా రాదా అంటూ విశ్లేషణ మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ కి అవార్డు రాదు… వాళ్ళు రానివ్వరు…

ఇక అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సినిమాలో ఇద్దరి నటన చాలా బాగా ఉంది పోటీ పడి ఇద్దరూ నటించారు. అయితే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. పాతతరం నటులు కళ్ళతో హావాభావాలు పలికించేవారు అందుకే క్లోజ్ షాట్స్ సినిమాల్లో ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పటి నటులు అలా నటించలేరని క్లోజ్ అప్ షాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. లాంగ్ షాట్స్ తో దర్శకులు పని కానిస్తున్నారు. అయితే ఇప్పటి తరంలో కళ్ళతో హావభావాలు పలికించగల నటుడు ఎన్టీఆర్. కొమరం భీముడు పాటలో కళ్ళతోనే కోపం, బాధ, వంటి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఇచ్చాడు ఒకే పాటలో అది చాలా తక్కువ మందికి సాధ్యం.

అయితే ఆస్కార్ కి ఇంకా అయన నామినేషన్ లో లేడు. కేవలం నామినేషన్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్నాడు అంతే. కానీ ఒకవేళ నిజంగా నామినేట్ అయినా అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర నాటకీయత హావభావలు అంటూ చూస్తాము కానీ హాలీవుడ్ లో మొహంలో భావాలు లేకుండా ఉండేదే నటన అన్నట్లు భావిస్తారు. వాళ్ళ సినిమాల్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు గమనిస్తే అందుకే మన వాళ్లకు ఇస్తారనే నమ్మకం లేదు. కానీ అక్కడిదాకా వెళ్లడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పచ్చు అంటూ శ్రీనివాసరావు రావు గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago