Adusumilli Srinivasarao : గత కొన్నిరోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త అందరినీ ఊరిస్తోంది. అదే కొమరం భీముడో పాత్రకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అవ్వబోతున్నాడు అని. హాలీవుడ్ పత్రిక వెరైటీ ప్రచురించిన లిస్ట్ లో ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితా లో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ఉంది. అయితే నిజానికి ఆస్కార్ నామినేషన్స్ లో ఇంకా ఎన్టీఆర్ పేరు ఉందొ లేదో కానీ ఆ లిస్ట్ లో ఉండే అవకాశం ఉందనగానే ఇక్కడ వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందా రాదా అంటూ విశ్లేషణ మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ కి అవార్డు రాదు… వాళ్ళు రానివ్వరు…
ఇక అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సినిమాలో ఇద్దరి నటన చాలా బాగా ఉంది పోటీ పడి ఇద్దరూ నటించారు. అయితే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. పాతతరం నటులు కళ్ళతో హావాభావాలు పలికించేవారు అందుకే క్లోజ్ షాట్స్ సినిమాల్లో ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పటి నటులు అలా నటించలేరని క్లోజ్ అప్ షాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. లాంగ్ షాట్స్ తో దర్శకులు పని కానిస్తున్నారు. అయితే ఇప్పటి తరంలో కళ్ళతో హావభావాలు పలికించగల నటుడు ఎన్టీఆర్. కొమరం భీముడు పాటలో కళ్ళతోనే కోపం, బాధ, వంటి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఇచ్చాడు ఒకే పాటలో అది చాలా తక్కువ మందికి సాధ్యం.

అయితే ఆస్కార్ కి ఇంకా అయన నామినేషన్ లో లేడు. కేవలం నామినేషన్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్నాడు అంతే. కానీ ఒకవేళ నిజంగా నామినేట్ అయినా అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర నాటకీయత హావభావలు అంటూ చూస్తాము కానీ హాలీవుడ్ లో మొహంలో భావాలు లేకుండా ఉండేదే నటన అన్నట్లు భావిస్తారు. వాళ్ళ సినిమాల్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు గమనిస్తే అందుకే మన వాళ్లకు ఇస్తారనే నమ్మకం లేదు. కానీ అక్కడిదాకా వెళ్లడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పచ్చు అంటూ శ్రీనివాసరావు రావు గారు అభిప్రాయపడ్డారు.































