Movie News

Sitaramam Movie: సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..?

Sitaramam Movie: తెలుగు సినిమాలకు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల మొదట్లో విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2సినిమాలు విడుదలయి ఇప్పటికి భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా వచ్చిన సినిమా సీతారామం.

ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన అవకాశం సరాసరి దుల్కర్ సల్మాన్ కు దక్కలేదు.కొందరు టాలీవుడ్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఇలాంటి సూపర్ హిట్ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చింది.

మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ హను రాఘవపూడి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించారట. ఈయన కిఈ సినిమా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని ఒకానొక సమయంలో డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ కాదనడంతో ఈ సినిమా కథతో డైరెక్టర్ హీరో రామ్,నానికి కూడా వినిపించారట.

Sitaramam Movie: ఆ సినిమాల కోసం హిట్ సినిమాని వదులుకున్న హీరోలు…

ఈ విధంగా నాని రామ్ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం దుల్కర్ సల్మాన్ కు వెళ్ళింది. ఇలా ఈ సినిమాతో మలయాళ నటుడు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మన టాలీవుడ్ హీరోలు మాత్రం డిజాస్టర్ సినిమాలు చేయడం కోసం ఈ సూపర్ హిట్ సినిమాని చేతులారా వదులుకున్నారని చెప్పాలి. నాని నటించిన అంటే సుందరానికి సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు ఇక రామ్ నటించిన దివారియర్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఈ హీరోలు సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago