అస్సాం ప్రభుత్వం స్కూల్ లో చదివే విద్యార్థినులకు ఇంటర్ పాసైన విద్యార్థినులకు, పై తరగతులు చదివే విద్యార్థినులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకుంది. అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రతిరోజూ స్కూల్ కు వెళ్లే విద్యార్థినులకు రోజుకు 100 రూపాయల చొప్పున ఇస్తామని కీలక ప్రకటన చేశారు.
రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు చదువుకోవడానికి ఖర్చులకు ఆర్థిక సహాయం అందుతుందని అస్సాం సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసైన విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా స్కూటీని అందజేయనుంది. ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా త్వరలో అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్, ఆ పై తరగతులు చదివే విద్యార్థినులను ప్రభుత్వం ఖర్చుల నిమిత్తం 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పుస్తకాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఖాతాల్లో నగదు జమ చేయనుంది. బీజేపీ సర్కార్ గతేడాది ఈ స్కీమ్ లను అమలు చేయాలని భావించింది.
ఆయితే కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల స్కీమ్ ల అమలు సాధ్యం కాలేదు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం, తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో అస్సాం సర్కార్ ప్రస్తుతం ఈ స్కీమ్ ను అమలు చేస్తూ విద్యార్థినులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…