ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
బీ.ఫార్మసీ, డిప్లొమా చదివిన అభ్యర్థులతో పాటు మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ చదివిన ఐటీఐ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్లు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగాలలో బీ ఫార్మసీ చదివిన వాళ్లకు 30 ఖాళీలు, డిప్లొమా చదివిన వాళ్లకు 50 ఖాళీలు ఉన్నాయి.
ఐటీఐ ఉద్యోగాలకు 50 ఖాళీలు ఉండగా బీఎస్సీ కెమిస్ట్రీ 20 ఖాళీలు ఉన్నాయి. అర్హత, అనుభవం ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. టెక్నికల్ రౌండ్, హెచ్. ఆర్ రౌండ్ ద్వారా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…