ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. వైద్యులు బెలెటిన్ కూడా వెల్లడించారు.
ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి ప్రముఖ నటుడు బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు స్పోర్ట్స్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
యాక్సిడెంట్‌లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని వాపోయారు.
కుమారుడు కోల్పోయిన బాధ ఒక తండ్రిగా తనకు తెలుసునని.. సాయి హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడని అన్నారు. ఎవరు బైక్ నడిపినా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. ఎవరూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు.. కానీ దురదృష్టం వెంటాడితే ఎవరూ ఏమి చేయలేరన్నారు. అందుకే రోడ్డు మీదకు బైక్ తీసింది మొదలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ.. సూచించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…