Babu Mohan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో ఈయన బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.
ఇక ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన విడిపోయి బిజెపి పార్టీలోకి చేరారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాబు మోహన్ పలు విషయాల గురించి మాట్లాడుతూ సదరు యాంకర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ మొదట్లో యాంకర్ తో కలిసి సరదాగా మాట్లాడిన ఈయన యాంకర్ అడిగిన ప్రశ్నలకు తరువాత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు కెసిఆర్ ను బావ అంటూ పిలిచేవారు. ఇప్పుడు ఎందుకు తనని తిడుతున్నారంటూ ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మీకు ఎంతవరకు సమాధానం కావాలో ఏం చెప్పాలో నాకు తెలుసు అంటూ మండి పడ్డారు. ఇలా డిస్కషన్ చేస్తేనే జనాలకు అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ యాంకర్ ప్రశ్నించారు.
Babu Mohan: మండిపడుతున్న నెటిజెన్స్…
ఇలా యాంకర్ అడగడంతో బాబు మోహన్ సమాధానం చెబుతూ ఇప్పుడు తాను ఫ్రీగా లేనని మరోసారి తన ఇంటికి వస్తే ఒక పూట కాదు రెండు రోజులు మా ఇంట్లోనే ఉండి తీరికగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అంటూ బాబు మోహన్ యాంకర్ పై మండిపడ్డారు.ఇలా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నైటిజన్స్ బాబు మోహన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…