Movie News

Aishwarya Bhaskaran: ఫోన్ నెంబర్ ఇస్తే ప్రైవేట్ పార్ట్ ఫోటోలు పెట్టి విసిగిస్తున్నారు… ఆవేదన చెందిన నటి!

Aishwarya Bhaskaran: ఈ సమాజంలో ఆడవారిపై పెద్ద ఎత్తున వేధింపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆడవారి సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చిన మహిళల పట్ల పురుషుల వేధింపులు ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఇందుకు సెలబ్రెటీలు కూడా అతీతులు కాదు.ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎంతోమంది నటీమణులు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇదివరకే ఎంతోమంది తెలియచేశారు.

తాజాగా నటి ఐశ్వర్య భాస్కరన్ సైతం తాను పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురయ్యానని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి లక్ష్మి కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య భాస్కరన్ అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించితెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో ఈమె లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో తాను సోప్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపారు. అయితే ఆర్డర్ల కోసం తాను తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఎంతోమంది ఇదే అదునుగా భావించి తనకు అసభ్యకరమైన మెసేజ్ లు చేస్తున్నారని తెలిపారు.

Aishwarya Bhaskaran: మానసికంగా ఒత్తిడికి గురిచేసాయి…

ఇక కొందరైతే పురుషుల ప్రవేట్ పార్ట్ ఫోటోలు తనకు పంపిస్తున్నారని,ఇవన్నీ తనని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తాను ఈ విషయం గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు, ఇకపై ఈ వేధింపులు కనుక మానుకోకపోతే తప్పనిసరిగా తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె షేర్ చేస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago