Movie News

Karthik Dandu: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ కావడానికి ఆ హీరోయిన్ కారణం: విరూపాక్ష డైరెక్టర్

Karthik Dandu: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా సంయుక్త మీనన్ మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి భీమ్లా నాయక్ సినిమా ద్వారా అడుగు పెట్టారు.

ఈ సినిమా సక్సెస్ కావడంతో వెంటనే బింబిసారా, సార్ వంటి సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకున్నారు. ఈ సినిమాలు కూడా సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో అందరూ కూడా సంయుక్త మీనన్ ను గోల్డెన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ ఈ విషయం గురించి డైరెక్టర్ ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ… నటి సంయుక్త మీనన్ నటించిన వరుస సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి తనని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నాము.అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరగకముందే ఈ సినిమా గురించి చర్చలు అన్ని జరిగాయి. ఇక అప్పుడు ఈ సినిమా కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసాము. అయితే ఆమె వచ్చిన తర్వాతే సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగిందని ఆమెని ఐరన్ లెగ్ అని పిలవలేము కదా అంటూ కామెంట్ చేశారు.

Karthik Dandu: స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది…

ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనేది ఏదీ ఉండదని అంతా కూడా స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా కార్తీక్ దండు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన మాట్లాడే సమయంలో తను వచ్చాకే ప్రమాదం జరిగిందని చెప్పడంతో ఒక్కసారిగా సంయుక్త మీనన్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు.ఏది ఏమైనా డైరెక్టర్ కార్తీక్ దండు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago