Featured

Bahubali Vinay : రాకేష్ మాస్టర్ ని వాళ్ళే చంపేశారు… తాగించి తాగించి చంపేశారు…పిల్లల కోసమే చనిపోయాడు…: బాహుబలి వినయ్

Bahubali Vinay : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయనకు అత్యంత ఆప్తుడైన బాహుబలి వినయ్ ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాగించి చంపారు… ఆయన దేవుడు…

రాకేష్ మాస్టర్ ను దగ్గరగా చుసినవాళ్లకు తెలుసు ఆయన ఎలాంటి వాడో అంటూ బాహుబలి వినయ్ అభిప్రాయపడ్డారు. ఆయన చాలా మంచి వ్యక్తి, తన దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయం చేయమని అడిగితే వెంటనే చెస్తారు. తన దగ్గర ఉందా లేదా అని చూడరు. ఈ యూట్యూబ్ లో ఆయనకు మద్యం తాగించి ఇంటర్వ్యూలలో రెచ్చగొట్టి మాట్లాడించి ఆయనను దిగజార్చారు. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ చెప్పారు వినయ్.

ఆయన ఇంకెన్నాళ్లు బ్రతుకుతాడో ఆయనకు తెలుసు అందుకే ఆయన తన పిల్లలకు ఏదైనా చేయాలని కూతురు గురించి ఎక్కువగా ఆలోచించేవాడు అంటూ చెప్పారు. ఆయనలో చివరి రోజుల్లో చాలా మార్పు వచ్చిందని, పిల్లకు ఏదైనా చేయాలని అనుకునేవారని వినయ్ తెలిపారు. ఆయనకి మందు ఎక్కువగా తాగించి తాగించి ఇలా చేసారని ఫైర్ అయ్యారు. ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఆయనను మోసం చేశారంటూ చెప్పారు. అందరూ ఉపయోగించుకుని మోసం చేసినవాళ్ళే అంటూ రాకేష్ మాస్టర్ గురించి బాధపడ్డారు వినయ్. పిల్లలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే విజయనగరంలో ఆ షూటింగ్ కి వెళ్ళాడు. అంతలోనే ఇలా జరిగింది అంటూ అభిప్రాయపడ్డారు వినయ్.

Bhargavi

Recent Posts

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

6 minutes ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

15 minutes ago

ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే అదృష్టం మారుతుందా?

శమీ వృక్షం గురించి మన సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇది సాధారణంగా కనిపించే చెట్టు అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా మరియు…

21 minutes ago

రెండేళ్లు ఒకే డ్రస్.. అంజి వెనుక షాకింగ్ నిజాలు

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు విడుదలైన సమయంలో సాధారణంగా అనిపించినా, కాలం గడిచేకొద్దీ వాటి విలువ మరింత పెరుగుతుంది.…

58 minutes ago

నా దగ్గర పని చేసినవాడు.. పెద్ద డైరెక్టర్ అయ్యాక కలిసే అవకాశం లేకుండా పోయింది

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన శుభలేఖ సుధాకర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

1 hour ago

పంచాక్షరీ మంత్రం అంటే ఏమిటి? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మంత్రం అత్యంత…

1 hour ago