Featured

Balagam fame Muralidhar : రూప లక్ష్మి భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కాను… సినిమాలో ఆ సీన్ కి ఆడపిల్లలు ఫోన్ చేసి…: బలగం ఫేమ్ మురళీధర్

Balagam fame Muralidhar : తెలంగాణ పల్లె సంస్కృతిని చూపుతూ కుటుంబ బంధాలను చూపించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా ఎంతో మంది సినిమాను చూసేలాగా సినిమా ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా చూసి కొన్ని కుటుంబాలు కలిసిపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒక సినిమా మనుషులను ఇంత ప్రభావితం చేస్తుందా అనేలాగా బలగం సినిమా నేడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డైరెక్టర్ చెప్పకపోయినా అలా చేశా…

బలగం సినిమా మొత్తం ఒకెత్తయితే సినిమా చివరి 20 నిముషాలు ఒకెత్తు. అందులోనూ కాకి పిండాన్ని ముట్టాలనే సీన్ లో కొమురమ్మ, మొగిలియ్యల పాట అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆ పాటలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి పేరు పలికే సమయంలో అల్లుడా నారాయణ అని పిలిచినపుడు నారాయణ పాత్రలో ఉన్న మురళీధర్ గారు తలపైకి ఎత్తి చూస్తారు ఆ సీన్ లో నిజానికి ఆయన అలా ఎత్తి చూడమని డైరెక్టర్ చెప్పలేదట.

ఇక వెంటనే కూతురు లచ్చవ్వ అనగానే ఆమె భుజం పై చేయి వేయగా ఆమె చూడలేదట అయితే మరో సారి చేయి వేసి నొక్కే సరికి రూప లక్ష్మి గారు తన చేయి నారాయణ చేతిలో వేయడం నారాయణ గారు ఆమె చేతులను పట్టుకుని ఎమోషనల్ అయ్యే సీన్ ఉంటుంది. ఇదంతా డైరెక్టర్ ముందుగా చెప్పింది కాదు. కాకపోతే పాత్రలో లీనం అయిపోవడం వల్ల అపటికప్పుడు నారాయణ పాత్రలో ఉన్న మురళీధర్ గారు చేశారట. కానీ థియేటర్లో ఆ సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారని మురళీధర్ గారు ఇంటర్వ్యూలో తెలిపారు. చాలా మంది ఆడపిల్లలు ఫోన్ చేసి ఆ సీన్ లో ఏడుపొచ్చిందని చెప్పారట.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago