Movie News

Balagam Fame Rupa Lakshmi : దిల్ రాజు గారు నాకు అనుకున్న పేమెంట్ కంటే…: బలగం ఫేమ్ రూపలక్ష్మి

Balagam Fame Rupa Lakshmi : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూప లక్ష్మి గారు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పంచుకున్నారు.

బలగం సినిమాకు నా రెమ్యూనరేషన్…

రూపలక్ష్మి గారు బలగం సినిమా కంటే ముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా ఈ సినిమాతో మంచి పేరు గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తాలుకు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో తాను హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కి తల్లిగా లక్ష్మి పాత్రలో ఎంత సహాజంగా నటించిందో అందరికీ తెలుసు.

ఇక బలగం సినిమా కంటే ముందు కూడా దిల్ రాజు గారి బ్యానర్ లో నటించిన రూపలక్ష్మి గారు తన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ తాను ఆర్థికంగా బాగున్నట్లు, సినిమాలు లేకపోయినా ఆర్థికంగా బాగానే కుటుంబం ఉన్నట్లు తెలిపారు. అయితే దిల్ రాజు గారి బ్యానర్ లో ఇంతకు ముందు నటించినపుడు కూడా రెమ్యూనరేషన్ బాగానే ఇచ్చారు. అందువల్లే కదా మళ్ళీ మళ్ళీ అదే బ్యానర్ లో చేస్తాం. రెమ్యూనరేషన్ నచ్చకపోతే ఎందుకు చేస్తాం. ఇక బలగంకి కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ చెప్పారు రూపలక్ష్మి.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

8 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

9 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

10 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

11 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

11 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

11 hours ago