Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న సాయి ధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ వల్ల తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ చాలా కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అనారోగ్యం నుండి కోలుకొని మామూలు మనిషిలా ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ సినిమా గురించి,తన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు అభిమన్యులతో పంచుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి తనని కాపాడిన వ్యక్తికి తాను చేసిన సహాయం గురించి వెల్లడించాడు..ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..సరైన సమయంలో అతను నన్ను కాపాడకపోతే నేను ఈ రోజు మీ ముందు ఉండేవాడిని కాదు. మానవత్వంతో అతను నాకు చేసిన సహాయానికి నేను డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేను.
అందుకే అతన్ని కలిసి నా నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా ఫోన్ చేయమని చెప్పాను .నా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో నాకు తెలియదు. కానీ అతనికి సహాయం చేయటానికి నేను ఎంత దూరమైన వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆ రోజు డైరెక్టర్ దేవకట్ట ఇంటికి తాను వెళుతున్నానని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…