Featured

NTR – Balakrishna : బాబాయ్ తప్పుకున్నారు.. అబ్బాయి ఒప్పుకున్నారు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.!!

ఒక హీరోకు చెప్పిన కథను మరొక హీరో అంగీకరించి సక్సెస్ కొట్టిన సందర్భాలు అనేక మనం చరిత్రలో గమనించవచ్చు. దాదాపుగా అలా వచ్చిన 90% చిత్రాలు విజయవంతం కాగా 10% చిత్రాలు మాత్రమే పరాజయాన్ని చవిచూశాయి. చిన్న వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన అతికొద్ది మంది నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా అతని సినీ ప్రయాణం మొదలైంది.

జానియర్ NTR నటించిన సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు నందమూరి చిన్నోడు. కేవలం 20 ఏళ్ళ వయసులో నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడ్డాడు. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో మంచి విజయాలు అందుకున్నమ జూనియర్ ఎన్టీఆర్..సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రావడానికి ప్రధాన కారణం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ ఈ సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపడ్డారు.

సింహాద్రి సినిమా వెనక ఇంకా చాలా పెద్ద కథ ఉంది అంటూ ఆయన ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ ఎప్పుడో రాసిపెట్టి ఉన్నది అని.. నిజానికి బాలయ్యతో సింహాద్రి సినిమా చేయాలని చెప్పాడు విజయేంద్రప్రసాద్. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా చేయాల్సి ఉన్నా.. ఆ కథ ఆయనకు నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్లలేదు అని చెప్పాడు విజయేంద్రప్రసాద్. అప్పటికే అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజుతో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో తన కొడుకు కోసం అయితే సింహాద్రి కథ ఇస్తాను అంటూ తాను చెప్పడం.. అందులోకి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్.

అసలు ఈ కథ పుట్టడం వెనుక మరో కథ కూడా ఉంది చెన్నైలో ఒకసారి విజయేంద్రప్రసాద్ తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు.. సింహాద్రి సినిమా ఆలోచన పుట్టింది. క్లైమాక్స్ లో కమల్ హాసన్ ను చూసి హీరోయిన్ శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోయింది కదా అని సరదాగా తన అసిస్టెంట్ తో అన్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇది ఇంటర్వెల్ గా చేసి కథ రాయడం మొదలు పెట్టామంటూ చెప్పుకొచ్చాడు ఈయన.

అందుకే సింహాద్రి ఇంటర్వెల్లో భూమిక గునపంతో జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో గుచ్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మొత్తం పూర్తయ్యాక బాలయ్యకు చెప్తే ఒప్పుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ లైన్ లోకి రావడం.. అది చరిత్ర సృష్టించడం అన్నీ జరిగిపోయాయి అంటూ పాత విషయాలు గుర్తు చేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్.2003లో విఎంసి ప్రొడక్షన్స్, దొరస్వామిరాజు నిర్మాణం, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో జూనియర్ NTR, భూమిక అంకిత హీరో, హీరోయిన్లుగా నటించారు. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి స్వరపరిచిన.. చీమ చీమ చీమ చీమ.. , నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డీ అనే పాటలు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. 8.5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 27 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago