సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనపడాలని భావిస్తారు.ఈక్రమంలోనే మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసి తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తారు.అయితే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ వివిధ రకాల రసాయనాలతో తయారు చేసి ఉంటారు. కనుక చర్మానికి కొంతవరకు ప్రమాదకరంగా మారవచ్చు. కనుక సహజసిద్ధంగా మన అందాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఎలాంటి ప్రభావాలు లేకుండా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి మన అందాన్ని రెట్టింపు చేయడానికి ఆలూ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
బంగాళా దుంపలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి,విటమిన్- B6, పొటాషియం,థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు సైతం ఆలూలో ఉన్నాయి. అదేవిధంగా బంగాళా దుంపలలో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ తదితర ఫైటో రసాయనాలు ఉన్నాయి.
ఎన్నో పోషకాలు కలిగిన బంగాళదుంప కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడుతుంది.కళ్ళకింద నల్లటి వలయాలతో బాధపడేవారు బంగాళదుంపల నుంచి తీసిన రసాన్ని కాటన్ సహాయంతో తీసుకొని కళ్ళ కింద సుమారు 15 నిమిషాల పాటు మర్దన చేయడం ద్వారా కంటి కింద ఉన్న మచ్చలు నల్లటి వలయాలు తొలగిపోతాయి.ఈ బంగాళా దుంప రసంతో ప్రతిరోజు మన ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి.
ఎంతో కాంతివంతమైన చర్మం పొందాలనుకునేవారు బంగాళదుంప రసంలోకి ఒక టీ స్పూన్ ముల్తాని మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఏర్పడిన మృతకణాలు తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. బంగాళదుంపను మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం ఎంతో మృదువుగా మారుతుంది. బంగాళాదుంపతో ఈ చిట్కాలు పాటించడం వల్ల అందమైన, కాంతివంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…