Bheeshma Sujatha : ‘భీష్మ’ సినిమాలో మత్స్య గ్రంధి పాత్రలో నటించి ఆ సినిమా పేరుతోనే తనకు గుర్తింవు తెచ్చుకున్న అలనాటి నటి భీష్మ సుజాత. ఆ సినిమా తరువాత తమిళం, తెలుగు, కన్నడ ఇలా మూడు భాషలలోనూ మంచి చిత్రాలను చేసిన ఆమె ‘దాన వీర శురా కర్ణ’ సినిమా ద్వారా మరో సారి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని నటనకు దూరమైన ఆమె మళ్ళీ ఆర్థిక ఇబ్బందులకు వల్ల సినిమాల్లో నటించి వచ్చిన చిన్నవేషం కూడా వేసారు. ఇక నాగమ్మ, మూడుముళ్ల బంధం వంటి పలు తెలుగు సీరియల్స్ లో కూడా నటించిన సుజాత గారు తమిళం, తెలుగులో సీరియల్స్ చేస్తూ అలానే డబ్బింగ్ కూడా చెప్పారు.
కొడుకు, మనవడు కూడా నటులే…
సుజాత గారు పిఠాపురం జామిందారుగారి మనవడు అప్పారావు గారిని పెళ్లి చేసుకున్నారు, ఆయన ఆస్తులన్నీ కోర్టుల్లో చిక్కుల్లో పడి మొత్తం పోగొట్టుకున్నారు. చివరికి ఇర్థిక ఇబ్బందులకు కారణంగా సుజాతగారు మళ్ళీ నటించాల్సి వచ్చింది. అయితే ఆమెకు ఒక కొడుకు, సుజాత గారి అబ్బాయి ఎంవి భానుప్రకాష్ కూడా నటుడే. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అలానే సీరియల్స్ లో నటిస్తూ ఫేమస్ అయ్యారు. ఇక ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ లో కూడా ఉన్నారు. ఇక సుజాత గారి మనవడు అజిత్ సినిమాలో నటించాడు. అలానే తాను హీరో అవ్వాలని అనుకుంటున్నట్లు సుజాత గారు వివరించారు. ఇక ప్రస్తుతం సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటున్న సుజాత గారు తాను సినిమాల్లో నటించేటపుడు జరిగిన సంఘటనలను వివరించారు.
ఒక సినిమా కోసం నూతన్ ప్రసాద్ తో నటించినపుడు ఆయన చంప మీద కొట్టాల్సినపుడు నిజంగానే కొట్టమని కోదండ రామిరెడ్డి గారు చెప్పడంతో కొట్టానని, అయితే గట్టిగా తగిలి నూతన్ ప్రసాద్ గారి దవడ పగిలిందని హాస్పిటల్ వెళ్ళవలసి వచ్చిందంటూ చెప్పారు. నిజంగానే కొట్టమని చెబుతే ఇంత గట్టిగానా కొట్టేది అని సీన్ అయ్యాక నూతన్ ప్రసాద్ అన్నారట. సినిమాల్లో కథ చెప్పినపుడు పాత్ర ఒకలాగా చెబుతారు, సినిమా విడుదల అయ్యాక చూస్తే చాలా తక్కువగా పాత్ర ఉంటుంది, ఇలాంటి అవమానాలు చాలానే ఉన్నాయి అంటూ తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…