BHEL Prasad : చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఆ తరువాత పలు సీరియల్ లో నటించినా ఆ సీరియల్ లో వచ్చిన గుర్తింపు ఇంకే సీరియల్ కు రాలేదు. ఇప్పటికే ఆయన పేరు ప్రసాద్ అనే కంటే విల్సన్ అని చెబితే బాగా గుర్తుపడతారు. ఒకసారి తిరుమలకి వెళ్లిన సమయంలో అక్కడ పురోహితులు చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా గుర్తుపట్టి మాట్లాడించడం బాగా అనిపించిందని చెప్పిన ప్రసాద్ గారు సినిమాల్లో అవకాశాలకోసం పడిన అవమానాలను, కష్టాలను గురించి చెప్పారు.
పూరీ ఇంటికి వెళ్తే గేట్ బయట నిలబెట్టి అవమానించారు…
ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, శ్రీకారం వంటి సినిమాల్లో నటించిన ప్రసాద్ గారు సినిమా అవకాశాలు కోసం ఆయన ప్రయత్నాల్లో ఉన్నపుడు ఎదుర్కొన్న అవమానాలను చెప్పారు. అవకాశం కోసం ఒకసారి పూరీ జగన్నాథ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది నన్ను గేట్ బయటే ఆపేసారు. లోపలికి వెళ్లనివ్వలేదు. అతను నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది. కానీ ఆ నిమిషం చాలా బాధగా అనిపించింది. నాకు ఆర్థికంగా ఏ లోటు లేదు కదా ఇలా ఇంకొకరి ఇంటి ముందు ఇలా పడిగాపులు ఎందుకు అనిపించింది. కానీ అలా అనుకుంటే మంచి అవకాశాలు రావు కదా అనిపించి అక్కడే ఎదురు చూసాను.
అక్కడ డ్రైవర్ ఒకరు నన్ను గుర్తు పట్టగా లోపలికి వెళ్ళినపుడు బి హెచ్ఇ ఎల్ ప్రసాద్ వచ్చార్స్ని చెప్పు లోపలికి రమ్మంటే ఓకే లేదంటే లేదు అని చెబితే, ఆ డ్రైవర్ లోపలికి వెళ్ళాక కాసేపయ్యాక పూరీ గారు కారులో లోపలి నుండి బయటికి వచ్చి నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. లోపలికి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు వెళ్లి కలవండి అని చెప్పారు. ఇక సినిమాలో నటిస్తున్నపుడు, నేను సీరియల్ లో నటించే సమయంలో నా కన్నా చిన్న ఆర్టిస్ట్ ఆ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాడు. అతనికి సెపెరేట్ కారవన్ కూడా ఇచ్చారు. మాకు నలుగురికి కలిసి ఒక రూమ్ ఇచ్చారు. సక్సెస్ అనేది ఎవరి ఫేట్ ని అయినా డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. నాకు చక్రవాకం సమయంలో ఫేమ ఉంది ఇపుడు అతనికి ఉంది అంతే మళ్ళీ నాకొక రోజు వస్తుంది. ఆ రోజు మళ్ళీ మంచి అవకాశాలతో డిమాండ్ ఉన్న ఆర్టిస్టును అవుతాను అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…