బుల్లితెరపై మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి సోషల్ మీడియాలో రోజుకో కథనం వినిపిస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కాబోతోందని వార్తలు వినబడుతున్నాయి అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టులో యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న షణ్ముఖ జశ్వంత్ పేరు కూడా వినబడుతుంది. యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి షణ్ముఖ జశ్వంత్ బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడం కోసం షణ్ముఖ ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, అంత చెల్లించడానికి బిగ్ బాస్ సిద్ధంగా లేని క్రమంలో తాను బిగ్ బాస్ నుంచి తప్పుకుంటానని షణ్ముఖ చెప్పినట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనపై వచ్చే ఈ వార్తలకు స్పందించిన షణ్ముఖ అసలు విషయం తెలియజేశారు.
ఈ సందర్భంగా షణ్ముఖ జశ్వంత్ స్పందిస్తూ.. నెగిటివ్ కామెంట్స్ నాకు కొత్త కాదు.. రాసే వాళ్లను రాయనివ్వండి.. నేను చెప్పే వరకు ఏ విషయాన్ని కూడా నమ్మకండి అంటూ షణ్ముఖ జస్వంత్ ఇన్స్టా స్టోరీలో తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తుంటే షణ్ముఖ హౌస్ లోకి వెళ్తున్నాడా.. లేకపోతే తను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనడం లేదని సంకేతాలు ఇస్తున్నారా.. అనే సందేహాలు మొదలయ్యాయి.ఏది ఏమైనా ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాలని తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…