దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఈమెకున్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నయనతార రియల్ జీవితంలో కూడా ప్రేమలో పడటం,ప్రేమకు బ్రేకప్ చెప్పడం వంటి విషయాల ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి ఆ ప్రేమలో మునిగి తేలుతుందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే వీరిద్దరి రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.అదేవిధంగా ఈ ఏడాదిలో నిశ్చితార్థం జరుపుకొని వచ్చే ఏడాదిలో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవడం కోసం డబ్బులను కూడా కూడాపెడుతున్నామని ఓ సందర్భంలో విగ్నేష్ తెలియజేశాడు.
ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న నయనతార ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం లేదు.ఈ క్రమంలోనే ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నయనతార తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను వెల్లడించారు.ఈ క్రమంలోనే తనకు నిశ్చితార్థం జరిగిందని తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
గతంలో నయనతార తన ప్రియుడు విగ్నేష్ గుండెల పై చేయి వేసి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నా ఫోటోలు నయనతార వేలికి ఉంగరం ఉండటంతో అందరూ నిశ్చితార్థం జరిగిందని భావించారు. అయితే తన నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలపై నయనతార స్పందించకపోవడంతో నెటిజన్లు కూడా పెద్దగా ఈ విషయం గురించి పట్టించుకోలేదు. అయితే తాజాగా ఓ కార్యక్రమానికి వచ్చిన ఏమి తన నిశ్చితార్థం ఉంగరం అని చెప్పి అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…