Bigg Boss6: అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ నాగార్జున సినిమాలలో నటిస్తూనే టీవీ షోస్ కి హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది.
గతంలో పూర్తి అయిన 5 బిగ్ బాస్ సీజన్లలో నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ షో కి నాగార్జునని తప్ప వేరొకరిని హోస్ట్ గా ఊహించుకోలేరు. అంతలా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 లో నాగార్జున స్టైల్, మాట తీరులో కూడా చాల తేడా కనిపిస్తోంది. ఈ క్రమంలో నాగ్‌లో పస తగ్గిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీజన్ 6 లో నాగార్జున కోసం రూపొందించిన స్క్రిప్ట్ కూడా మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రేక్షకులు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 6 పట్ల అంతగా ఆసక్తి చూపటం లేదు. ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతోందో ప్రేక్షకులకు అంతుపడటం లేదు. బిగ్ బాస్ ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియాలో ముందే సమాచారం వచ్చేస్తోంది. అంతే కాకుండా వీకెండ్ లో కూడా నాగార్జున సీరియస్‌గా ఏదో హంగామా చేసేస్తున్నా, అదంతా ముందే జనానికి తెలిసిపోతోంది.
ఈ వారం ఎలిమినేషన్ గురించి కూడా ప్రేక్షకులకు ముందే తెలిసిపోయింది. చివరి నిమిషం వరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నాడని అందరిని టెన్షన్ పెట్టిన నాగార్జున చివరికి మాత్రం ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఈవారం ఎలిమినేషన్ లేదన్న సంగతి ప్రేక్షకులకు ముందే తెలిసిపోయింది. మొత్తానికి ఇంటి సభ్యుల ఆట తీరు మాత్రమే కాకుండ నాగార్జున కూడా ప్రేక్షకులని బాగా నిరాశపరుస్తున్నారు.
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…