బిగ్ బాస్ సీజన్ -5 ముగిసింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచింది. వీజే సన్నీ విజేతగా నిలిచారు. దాదాపు 15 వారాల పాటు హౌజ్ లో గడిపిన కంటెస్టెంట్లు తమ తమ విషయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అందరిలో అంచనాలు క్రియేట్ చేసిన శ్రీరామ్ చంద్ర టాప్ -3లో నిలిచారు. ఇండియన్ ఐడల్ 5 విజేతగా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత.. ఫైనల్ బరిలో ఖచ్చితంగా శ్రీరామ్ ఉంటారని ప్రేక్షకులు ముందు నుంచే అనుకుంటున్నారు.
అయితే టాప్ 3తోనే శ్రీరామ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్ లో అన్నింటి కన్నా ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ పైనే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ పైన అనేక రకాలుగా ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య హగ్గింగులు, కిస్సింగులు జనాల్లో బాగా ఫేమస్ అయ్యాయి.
ఇక అందరి చూపు తర్వాత సీజన్ ఎప్పుడు మొదలవుతుంది. దానికి కూడా నాగార్జున సీజన్ ముంగింపులో వెల్లడించారు. అతి త్వరలో అంటే మరో రెండు నెలల్లో బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక దీనిపై బిగ్ బాస్ వ్యూయర్స్, ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇప్పుడు ఇది సీజన్ 1గా రాబోతోంందా.. లేదా సీజన్ 6గా రాబోతుందా అనేది తెలవడం లేదు.
పూర్తి విరాల్లోకి వెళ్తే.. సీజన్ 6 కాకుండా.. ఈ సారి ఓటీటీలో సీజన్ 1గా మొదలు పెట్టాలని నిర్వాహకులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఓటీటీకి హోస్ట్ ఎవరు..? ఇప్పుడు ఉన్న సీజన్ 5 సెట్ ను మార్పులు చేర్పులు చేసి.. సీజన్ 1గా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన 15మంది సెలబ్రిటీలు ఎవరు అన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సీజన్ కచ్చితంగా ఓటీటీలోనే వస్తుందనే సమాచారం వినిపిస్తోంది.
సీజన్ 5 పూర్తి అయిన వెంటనే సీజన్ 6 అనేది పెట్టరు. నాగార్జున అనౌన్స్ చేసిందాన్ని బట్టి చూస్తే.. మరో రెండు నెల్లలోనే అంటే.. అది ఓటీటీలోనే స్ట్రీమ్ కానుంది. దీనికి మొదట శివబాలాజీ, నవదీప్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లను దీనిలో పంపించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందరిలో ఆసక్తిని పెంచేందుకు మొదటి షోను టీవీలో ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి హోస్ట్ ఎవరు అనే వివరాలు తెలయరాలేదు. రెగ్యూలర్ గా సీజన్ 6 మాత్రం జూన్ లో రానున్నట్లు తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…