బిగ్ బాస్ 5 ముగిసింది. అందులో సన్నీ విన్నర్ గా గెలిచాడు. రూ.50 లక్షల రూపాలయతో పాటు.. రూ.25 లక్షలు విలువ చేసే ప్లాట్ కూడా సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతడికి 15వారాలు హౌస్ లో ఉన్నందుకు కొంత అమౌంట్ కూడా వచ్చింది. అవి ఎంత..? అస్సలు హౌస్ లో ఉన్న 19 మంది కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంత..? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా ఎవరైనా.. ఏ ప్రోగ్రాం లేదా సినిమాలో యాక్ట్ చేస్తుంటూ.. అతడికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. దీనిలో ఎక్కువగా బిగ్ బాస్ లో పాల్గొన్న వారికి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవానలి చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఈసారి సీజన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకిచ్చిన పేమెంట్స్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ నోరెళ్లబెడుతున్నారు. వాళ్లకు ఫైనల్ గా ఎంత వచ్చింది.. అనే విషయాలకు వెళ్తే..
ముందుగా సన్నీ విషయానికి వస్తే.. అతడు వారానికి రూ.2లక్షల చొప్పున అగ్రిమెంట్ తీసుకోగా.. అతడతికి 15వారాలకు రూ.30 లక్షలు వచ్చాయి. దీంతోపాటుగా ప్రైజ్ మనీ 50 లక్షలు, సువర్ణభూమి వారు ఇచ్చిన 25లక్షల రూపాయల విలువగల ల్యాండ్, అలాగే 2 లక్షల రూపాయల విలువగల టివియస్ అపాచీ బైక్ సంపాదించుకున్నాడు. దీంతో 80 లక్షల క్యాష్, 27లక్షల గిఫ్ట్స్ ని అందుకున్నాడు సన్నీ. మొత్తానికి సన్నీ కోటికి పైగా సంపాదించాడు. ఇక రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ విషయానకి వస్తే.. వారానికి అతడికి రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వరకు మాట్లాడినట్లు సమాచారం. ఈ లెక్కన 15వారాలకు అతడు రూ.70 లక్షలకుపైగా వచ్చాయి.
సిరి రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే.. ఈమెకు వారానికి రూ. రెండు లక్షల చొప్పున మాట్లాడారట. దీంతో 15వారాలకు ఈమె రూ.30లక్షలు వచ్చిటన్లు తెలుస్తోంది. మానస్ విషయానికి వస్తే.. వారానికి రెండు లక్షలకు పైగానే వచ్చిందని.. మొత్తం మీద 40 లక్షల వరకూ 15వారాలకి అందుకున్నాడు అని అంటున్నారు. శ్రీరామచంద్రకు వారానికి రూ.3 లక్షలకు పైగానే ఇచ్చారట. అంటే దాదాపు 15 వారాలకు రూ.50లక్షలకు పైగానే అందుకున్నాడనే టాక్ వస్తోంది.
యాంకర్ రవికి హైఎస్ట్ రెమ్యూనిరేషన్ అని సమాచారం. ఇతడికి వారానికి రూ.7 లక్షల నుంచి రూ.8లక్షల మధ్య ఇచ్చారట. మొత్తం 12 వారాలకు రూ. 90 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ లో ఇదే హైఎస్ట్ పారితోషికమని అంటున్నారు. కాజల్ కు రెండు లక్షల చొప్పున రూ.30లక్షలు.. ప్రియాంక సింగ్ 1.75 చొప్పున దాదాపుగా 13 వారాలకి 25 లక్షలు.. అనీమాస్టర్ 11 వారాలకి 33 లక్షలు.. జెస్సీకి 1.5 లక్షలు చొప్పున 10 వారాలకి 15 లక్షలుకుపైనే వచ్చినట్లు సమాచారం.
లోబోకి 18 నుంచీ 20 లక్షలు.. ప్రియాంకకు 7 వారాలకి గానూ 10 లక్షలు.. శ్వేతావర్మకి ఒక్కోవారానికి 1 లక్షరూపాయల చొప్పున ఆరువారాలకి ఆరు లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ కి నాలుగు వారాలకి 4 లక్షలు.. ఉమాదేవికి మొత్తం రెండు వారాలకు 1.60లక్షలు.. సరయుకు వారానికి రూ.60 వేల చొప్పున ఇచ్చారని సమాచారం. హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వకు 22 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. లహరికి కూడా వారానికి 60 వేల చొప్పున.. తీసుకున్నట్లు తెలుస్తోంది.
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…