బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగు వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5వ వారం ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం మరింత గొడవలు వివాదాల నడుమ కొనసాగుతోంది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్ ఎవరి ఫుడ్ వాళ్లు చేసుకోవాలని చెప్పడంతో సిరి గ్యాంగ్, శ్రీరామ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇలా ఒకరిపై ఒకరు కోపంతో భోజనం పై అలుక చూపి పస్తులు పడుకున్నారు. ఇక ఇక మరుసటి రోజు ఉదయం గొడవలు కొట్లాటలు మరిచిపోయి అందరూ కలిసి టిఫిన్ లాగించారు.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లో కాజల్, రవి మధ్య మరోసారి గొడవ చోటు. ఈ క్రమంలోనే కాజల్ పాట పాడుతూ దానిని సాగదీస్తూ గత నెల రోజుల నుంచి లోబో, రవి వాష్ రూమ్ క్లీనింగ్ కే పరిమితమయ్యారని, కిచెన్ వైపు అసలు చూడటం లేదని డాన్సులు చేస్తూ చెప్పడంతో అందుకు స్పందించిన రవి మజాక్ అనేది కొంత వరకు అయితే బాగుంటుంది అంటూ తనకి వార్నింగ్ ఇచ్చాడు.
ఇక కాజల్ అన్న మాటలకు లోబో స్పందిస్తూ ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. లోబో అలా మిడిల్ ఫింగర్ చూపించడంతో హర్ట్ అయిన కాజల్ లోబోను నిలదీసి తప్పు అంటూ వాదించింది. ఇదే విషయాన్ని కాజల్ ప్రియాంక దగ్గర చెబుతూ బాధ పడటంతో అందుకు స్పందించిన ప్రియాంక నేనైతే ఆ వేలు విరిచేసేదాన్ని అని అనగా అందుకు కాజల్ బిగ్ బాస్ హౌస్ లో హింసకు తావు లేకపోవటం వల్ల తాను కూడా ఏమీ చేయలేక పోయానని చెప్పింది.
ఇక ఈ విషయంపై రవి నెలరోజుల నుంచి నేను కిచెన్ లో పని చేయలేదని నువ్వు ఎలా చెబుతావు అంటూ తనతో గొడవకు దిగాడు. దీంతో మాట మార్చిన కాజల్ నేను కేవలం మీకి కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే చెప్పానని మాట మారుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవటంతో మానస్ ఇన్వాల్వ్ అవుతూ ఎందుకలా అరుస్తున్నారు అంటూ మాట్లాడతాడు లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే అలా చేయకూడదని చెప్పకుండా తనకు సపోర్ట్ చేస్తున్నావ్ అని కాజల్ అనడంతో రవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ విషయంపై లోబోను హెచ్చరించానని తెలియజేశాడు. ఇలా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ చోటు చేసుకుంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…
సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…