సినీ పరిశ్రమలో కాస్తంత స్టార్ డమ్ వచ్చిందంటే చాలు.. వాళ్లు ఇక సెలెబ్రిటీ హోదా వచ్చేసినట్లే. అది ఒక్క సినిమాతోనే రావచ్చు.. లేదా మరికొన్ని సినిమాలతో రావచ్చు. కానీ ఎప్పటికైనా సెలెబ్రిటీ హోదా వస్తుంది. అయితే ఇలా వచ్చిన వారు.. ఇక వారి జీవన విధానంలో ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి .
ప్రస్తుతం రన్ అవుతోన్న బిగ్ బాస్ రియాల్టీ షో 4 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో నుంచి వచ్చిన వారుకూడా సెలెబ్రిటీ హోదా పొందిన వారు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది హరితేజ గురించి. మొదట ఆమె బిగ్ బాస్ లోకి రాకముందే.. యాంకర్ గా, నటిగా, హరికథలు పేరుతో యూట్యూబ్ చానల్ లో కూడా చేసింది.
అందులో ఎన్నో వీడియోలను పోస్టు చేశారు.. ప్రస్తుతం చేస్తున్నారు కూడా. అయితే ఆమె హోమ్ టూర్ పేరుతో మరో వీడియోను తన యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఆలీ భార్యతో పాటు పలువురు సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె చూపించిన ఆ వీడియోలో తాను ఎంతో ఇష్టపడి చేయించుకున్న ఇంటిరీయర్ డిజైన్స్‌తో కూడిన గదిని చూపించారు.
తన పాప కోసం ఇంట్లో ఏర్పాటు చేసిన ఊయలను చూపించారు. అది ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆమె చిన్ననాటి నుంచి డ్యాన్స్ కు సంబంధించిన విషయాలను పేపర్లో ప్రచురించారు. ఆ క్లిప్ లను ఆమె ఆ వీడియోలో చూపిస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఆమెకు ఎక్కువగా ఇష్టపడే రూం వంటగది అంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…