బుల్లితెరపై ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మొదటివారం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలోనే మొదటి వారం నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో యాంకర్ రవి, మానస్, కాజల్, హమీద, సరియు,జెస్సి నామినేట్ కాగా వీరిలో సరయు ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ చేశారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ హౌస్ లో ది బెస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ ఐదుగురు సభ్యులను సెలెక్ట్ చేసింది.
ది బెస్ట్ కంటెస్టెంట్ అంటూ సరియు శ్వేత, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద బెస్ట్ హౌస్మేట్స్ అంటూ వారిపై ప్రశంసలు కురిపించింది. అదే విధంగా ది వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ సిరి, షణ్ముఖ్, సన్నీ, లహరి, కాజల్ అంటూ వారి పేర్లను తెలియజేసింది. కాజల్ ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో పడాలని ఆరాటపడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదు అంటూ సరియు తెలియజేశారు. ఇకపోతే సిరి, షణ్ముఖ్ వీరిద్దరూ ముందుగానే ఒక ప్లాన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని ఆ ప్లాన్ ప్రకారమే ఆట ఆడుతున్నారు తప్ప నిజాయితీగా ఆడటం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా అసలు ఆట ఆడండి నిజాయితీగా ఆడండి అంటూ సిరి, షణ్ముఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సన్నీ గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ఇదివరకే ఒక సినిమాలో కలిసి నటించారు. అక్కడ వచ్చిన భేదాభిప్రాయాలు గురించి సన్నీ హౌస్ లో చూపిస్తున్నాడని సన్నీ గురించి తెలియజేసింది. ఇక లహరిని సరియు ఓ ఆటాడుకుందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా లహరి గురించి మాట్లాడుతూ ముందు నీ వాయిస్ కంట్రోల్ చేసుకో, ఏమీ లేని వారే ఎగిరెగిరి పడుతుంటారు లహరి ఇతరులపై పెద్దగా అరుస్తూ ఉంటుందని ముందుగా అది తగ్గించుకో అంటూ తెలిపారు ఇలా ఒకరిని తొక్కుతూ ఎదగడం మంచిది కాదు నీది ఏదైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి సరయు ఉన్నది హౌస్లో ఒక వారమే అయినప్పటికీ ఇవ్వాల్సిన వారికి భారీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…