బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో రసవత్తరంగా ప్రసారమవుతూ వారం రోజులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి కంటెస్టెంట్ సరియు ఎలిమినేట్ అయ్యారు . ఈ విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 5 బజ్కు సంబంధించి లెటేస్ట్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈసారి ఈ సీజన్ 5 బజ్కు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరీయానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత రెండు సీజన్ల నుంచి ఈ బిగ్ బాస్ బజ్ కార్యక్రమ నిర్వాహకులు ప్రారంభించారు.
గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీ బజ్ హోస్ట్ గా తనిష్ వ్యవహరించగా సీజన్ ఫోర్ బజ్ హోస్ట్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సీజన్ ఫైవ్ బజ్ హోస్ట్ గా ఆరియానా వ్యవహరించనున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సరియు బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సరియు హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ గురించి బోల్డ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సరయుని బిగ్ బాస్ బజ్ హోస్ట్ అరియానా సాదరంగా తనని ఆహ్వానించి బిగ్ బాస్ గురించి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరియు కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ముందుగా సిరి ఫోటోను చూపిస్తూ.. హౌస్ లో మగవాళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఈ సిరి అంటూ తన ఫోటోని బద్దలు కొట్టింది.
అదేవిధంగా యాంకర్ రవి గురించి మాట్లాడుతూ… మంచి వాడి మాదిరి నీతి సూత్రాలు చెబుతాడు కానీ ఇతని దగ్గర విషయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సన్నీ ఫోటో చూపిస్తూ ఇతనికి క్యారెక్టరే లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా హోస్ట్ అరియానాతో మాట్లాడుతూ ఎలుకలే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది. ఆ ఇంట్లో దమ్మున్న మగాడు ఒక్కడే విశ్వ అంటూ అతని పై ప్రశంసలు కురిపించింది సరియు.
ఇక కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ గురించి సరియు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా నీలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే అంటూ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బోల్డ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పూర్తి కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఈరోజు ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారం కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…