ఆ సినిమా తరువాత కోటా శ్రీనివాసరావును రక్తం కారేటట్టు కొట్టారు.. ఎందుకంటే!

ప్రస్తుతం ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నా దాని వెనకాల ఎంతో శ్రమ దాగి ఉంటుంది. అప్పుడు పడిన కష్టాలకు ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తుంటారు. అలా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోటులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా తన కెరీర్ ప్రారంభంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు. తర్వాత తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు కోట్లలో అభిమానులున్నారు. అయితే అతడి జీవితంలో కొన్ని ఘటనలు మర్చిపోకుండా ఉండేవి ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు. అందులో ఓ సంఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని.. ఆ ఘటనలో తాను చనిపోయే స్థితికి వచ్చిందని చెప్పాడు. ఇంతకు ఆ ఘటన ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో కోటా చాలా వరకు కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి.

అయితే 1987 నాటి రాజకీయ నేపథ్యమున్న ‘మండలాధీశుడు’ సినిమాను ప్రభాకరరెడ్డి దర్శకత్వం వహించారు. అందులో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. దీంతో కోటాపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తన అభిమాన నటుడిని ఇంత ఘోరంగా అవమాన పరిచేలా.. ఈ చిత్రంలో కోటా నటిస్తారా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయి ఎప్పుడు బయట దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అభిమానులకు దొరకగా.. అతడిని విపరీతంగా రక్తం కారేటట్టు కొట్టారట. తర్వాత అతడు చనిపోతాడేమోననే భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు అభిమానులు. ఆ సమయంలో తాను చనిపోతానని అనుకున్నట్లు కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.