Categories: FeaturedMovie News

Bobbili Simham : రచయిత విజయేంద్రప్రసాద్ బాలయ్య నటించిన “బొబ్బిలి సింహం” చిత్ర కథని ఆ సినిమా నుంచి తీసుకున్నారా.?!

1980 దర్శకుడు కోదండరామిరెడ్డి తన మొదటి చిత్రం “సంధ్య”తో సినీ రంగ ప్రవేశం చేసి తిరుగులేని, తీరికలేని దర్శకుడిగా ఎందరో స్టార్ హీరోలతో చిత్రాలను రూపొందించారు. ఇకపోతే బాల‌కృష్ణ, కోదండ రామిరెడ్డి కాంబినేష‌న్ అంటేనే అదిరిపోయే మాస్ మ‌సాలా. ఆ టైంలో కోదండ రామిరెడ్డి–బాల‌య్య కాంబోలో ఎన్నో సూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. తాను ఎన్టీఆర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ వ‌చ్చినా ఉప‌యోగించుకోలేక‌పోయాన‌ని.. అయితే ఆ లోటు బాల‌య్య‌తో చేసి సూప‌ర్ హిట్లు కొట్టి తీర్చుకున్నాన‌ని కోదండ రామిరెడ్డి ఎన్నోసార్లు చెప్పారు.

1992 ధర్మక్షేత్రం, 1993 నిప్పురవ్వ చిత్రాలు బాలకృష్ణ-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో విడుదలయ్యాయి. కానీ ఈ రెండు చిత్రాలు బాలయ్య అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 1994 నిర్మాత త్రివిక్రమరావు, బాలకృష్ణ-కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఒక చిత్రం నిర్మించాలనుకున్నారు. ఒక మాస్ మసాలా కథ కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇకపోతే రచయిత విజయేంద్రప్రసాద్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడున్న రచయితల్లో అత్యంత భారీ పారితోషికాన్ని పొందుతున్న విజయేంద్రప్రసాద్ ఒకప్పుడు నాగార్జునతో ఒక సినిమా రూపొందించాలని దర్శకుడు రాఘవేంద్రరావు విజయేంద్ర ప్రసాద్ ను సంప్రదించారు. అక్కినేని సావిత్రి నటించిన “మూగమనసులు” చిత్రం లాంటి కథ కావాలని ఆ సినిమాల ఉండకూడదు కానీ అలాంటి ఫ్లేవర్ తో ఓ స్టోరీ రాయమని రాఘవేంద్రరావు విజయేంద్రప్రసాద్ ను కోరడం జరిగింది. ఆ క్రమంలో వచ్చిన చిత్రమే జానకిరాముడు.ఆ విధంగా ఏ.కోదండరామిరెడ్డి బాలకృష్ణ కాంబినేషన్ అనగానే బాలయ్య అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలా దర్శకుడు కోదండరామిరెడ్డి విజయేంద్ర ప్రసాద్ ని బాలయ్యబాబుకు ఓ కథ రాయమని కోరడం జరిగింది.

ఆ క్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్ అక్కినేని- దాసరి కాంబినేషన్లో వచ్చిన ఒకనాటి బ్లాక్ బస్టర్ “ప్రేమాభిషేకం” చిత్రంతో స్ఫూర్తి పొంది ఒక కథ రాయడం జరిగింది. ప్రేమాభిషేకం చిత్రంలోని ఏఎన్ఆర్-శ్రీదేవి పాత్రలను రోజా-బాలకృష్ణలు గా చేశారు. ప్రేమాభిషేకం చిత్రంలో ఏఎన్నార్ కి క్యాన్సర్ వ్యాధి ఉండగా.. బొబ్బిలిసింహం చిత్రంలో రోజాకి క్యాన్సర్ ఉంటుంది. ఇకపోతే ప్రేమాభిషేకం పూర్తిగా లవ్ ట్రాక్ లో నడవగా.. బొబ్బిలి సింహం చిత్రాన్ని కాస్త మాస్ మసాలా అంశాలను జోడించి పూర్తిగా వాణిజ్య పరంగా తీర్చిదిద్దడం జరిగింది అలా… వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ బొబ్బిలి సింహం. 1994 సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 7 కోట్ల షేర్ రాబ‌ట్టింది. కీర‌వాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌. బాల‌య్య‌కు జోడీగా అప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న రోజా, మీనా న‌టించారు. ఇందులో రోజాది నెగిటివ్ పాత్ర‌గా ఉన్న ఆ పాత్ర సెంటిమెంట్ హృద‌యాల‌ను పిండేసింది. బొబ్బిలి సింహం 60 కేంద్రాల్లో 50 రోజులు, 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago