Featured

Assembly Rowdy : అసెంబ్లీలో ఉండే వాళ్లంతా రౌడీలా.? అంటూ.. “అసెంబ్లీరౌడీ” విడుదల సమయానికి పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.?!

1990 బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో విడుదలైన”లారీ డ్రైవర్” ఘన విజయం సాధించింది. ఇదే సంవత్సరం మోహన్ బాబు-రాఘవేంద్రరావు కాంబినేషన్లో విడుదలైన “అల్లుడుగారు” చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. అటు బి.గోపాల్ ఇటు మోహన్ బాబు మంచి స్వింగ్ లో ఉన్నారు. అలా.. “అసెంబ్లీ రౌడీ” 1991లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, దివ్యభారతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది మోహన్ బాబుకు కలెక్షిన్ కింగ్ అనే బిరుదును సాధించి పెట్టింది.

శివాజీ (మోహన్ బాబు) డిగ్రీ పూర్తి చేసుకుని అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. అతని తండ్రి (జగ్గయ్య) అదే ఊర్లో ఒక ఉపాధ్యాయుడు. ఆయనకు కొడుకు అలా ఊరికే ఉండటం నచ్చదు. పూజ (దివ్యభారతి) అదే ఊర్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడి (గొల్లపూడి మారుతీ రావు) కూతురు. శివాజీ ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఊర్లో దాదాగిరీ చెలాయించే బాషా అనే రౌడీ ఒక హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు. శివాజీ ఆ రౌడీ ని ఎదుర్కోవడానికి పోతుండగా తల్లి వారించి ఇంటికి తీసుకొస్తుంది. ఈ విషయం తెలిసినా తండ్రి కుటుంబం బాగోగులు చూడని నువ్వు దేశాన్ని ఉద్దరించడానికి బయలు దేరావా, నీ కష్టం తో ఏనాడైనా మాకు కట్టుకునే ఒక జత బట్టలు తీసుకరాగలవా, ముందు పనివెతుక్కో అంటూ తిట్టిపోస్తాడు.

మరో రోజు ఆ గొడవలో తన తల్లి తలకు గాయం అవుతుంది. దాంతో బాషా శివాజీ మీద కక్షతో అతన్ని ఓ నేరం మీద జైలుకి పంపిస్తాడు. శివాజీ తల్లిదండ్రులు అతన్ని కేసునుంచి బయట పడేయటానికి ఊర్లో వాళ్ళనెవరైనా సాక్ష్యం చెప్పమని అడుగుతారు. కానీ బాషాకు భయపడి ఎవరూ ముందుకు రారు. శివాజీ జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఇంతలోనే ఎన్నికలు వస్తాయి. ఒక లాయరు ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చునని సలహా ఇస్తాడు. శివాజీని జైల్లో నుంచే ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అతని తరపున ప్రచారం చేస్తారు. ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. అది భరించలేని బాషా అతని తల్లిదండ్రులని చంపేస్తాడు. శివాజీ ఆ రౌడీలను మట్టుబెట్టి కత్తిపోట్లతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చేరతాడు.చివర్లో అతను కోలుకుని ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.

అయితే ఈ సినిమా 1991 జూన్ 4న విడుదలయ్యింది. ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది… అసెంబ్లీరౌడీ అంటే అసెంబ్లీలో ఉన్న సభ్యులు రౌడీలా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా కటౌట్లు, పోస్టర్లు చింపేశారని. ఈ సినిమా నిజంగా ఎలా ఉందని కాంగ్రెస్ శాసనసభ్యులు రోశయ్య, గీతారెడ్డి స్వయంగా “అసెంబ్లీ రౌడీ” చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం జరిగింది. “అసెంబ్లీరౌడీ” చిత్రం పై దుమారం ఎందుకు.. అసెంబ్లీరౌడీ అంటే సినిమాలో ఓ పాత్ర అలాంటి పాత్రలు మేము కూడా గతంలో పోషించామని అప్పటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మాట్లాడిన క్లిప్పింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago