Chiranjeevi in national cultural day : హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవం జరిగింది. ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ రావు మెగావల్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. తన మాటలతో వేదికపై నవ్వులు పూయించారు. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. త్రిబుల్ ‘సి’ ఫార్ములాతో కల్చర్, క్రాఫ్ట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు చిరంజీవి.
భారతీయత తత్వం పటిష్టం చేయడానికి ఉత్సవాలు ఎంతో కృషి చేస్తాయని అన్నారు. ప్రాంతీయ సినిమాల మధ్య తెలుగు సినిమా హద్దులు చేరిపేసిందని చిరంజీవి పేర్కొన్నారు. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని ఈ విషయం స్వయంగా మోడీ చెప్పారని చిరంజీవి పేర్కొన్నారు.
నా మంత్రి పదవిని లాక్కున్నారు…
ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మెగాస్టార్ కేంద్ర సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీద సటైర్ లు వేశారు.. ‘‘అసెంబ్లీలో కూర్చునే కిషన్ రెడ్డి.. ఢిల్లీలో నా సీటు నుంచి నన్ను తప్పించి ఆయన కూర్చున్నారు.’’ అంటూ చమత్కరించారు.
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి…
ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కల్చరల్ ఫెస్ట్ లో వృత్తులను నమ్ముకుని ఉన్నవాళ్లనే పిలిచామని, ప్రొఫెషనల్స్‌ని పిలవ లేదని చెప్పారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇది ప్రభుత్వ పండగ కాదు , ప్రజల పండుగ అని చెప్పారు. 75 దేశాల్లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు15వ తేదీన ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి గారు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…