Bollywood : పాన్ ఇండియా సినిమా.. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. సౌత్ సినిమాలు బాలీవుడ్ గడ్డ మీద సత్తా చాటుతుండగా హిందీ సినిమాలు చతికిల పడుతున్నాయి. మళ్ళీ హిందీ సినిమాలకు పూర్వ వైభవం వస్తుందంటు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు యాక్టర్లు అంటున్నా మూస పద్ధతిలో సినిమాలు తీస్తూ జనాలకు ఏం కావాలో వదిలేసి నచ్చినది చేస్తుంటే వారు చూడరని, ఎంత పెద్ద హీరో అయిన సినిమా హిట్ కాదని ఇపుడిప్పుడే బాలీవుడ్ సినిమా వాళ్లకు అర్థమవుతున్నా ఇంకా మంచి సినిమా తీయలేకపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా అంటే ప్రపంచం అంత చూసేది. సినిమాలో ఎమోషన్స్, కుటుంబ బంధాలు, హీరో హావరోయిన్ మధ్య రొమాన్స్ ఇవన్నీ కలిసి హిందీ సినిమాలలో ఎన్నో సినిమాలు సౌత్ కి స్ఫూర్తిగా నిలిచేవి.
సౌత్ లో అలరించిన హిందీ సినిమాలు…
ఇపుడు బాలీవుడ్ సినిమాలకు, పాత హిందీ సినిమాలకు చాలా తేడా ఉంది. అప్పటి సినిమాలకు భాషతో సంబందం లేకుండా అన్ని ప్రాంతాల జనాలు ఆదరించేవారు. కథలో కంటెంట్ ఉంటే సినిమా, భాష తో సంబంధం లేకుండా హిట్లవుతాయి. 1990 ఆ మధ్య కాలం బాలీవుడ్ లో వచ్చిన సినిమాలు మొత్తం ఇండియాని ఉపేసాయి. సౌత్ లో డబ్బింగ్ తో కొన్ని, డబ్బింగ్ అవ్వకుండానే హిందీ లోనే నేరుగా విడుదలయి హిట్లు కొట్టాయి. అలాంటివాటిలో మొదట చెప్పుకోవాల్సిన చిత్రాలు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ నటించిన ‘మైనే ప్యార్ కియా’, తెలుగులో ‘ప్రేమ పావురాలు’ 1989 లో విడుదలైన ఈ చిత్రం తెలుగులోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.
ఇక సల్మాన్ ఖాన్ ‘ప్రేమాలయం’ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అయి మంచి హిట్ అయింది. ఇక షారుఖ్ ఖాన్ కాజోల్ నటించిన ‘ప్రేమించి పెళ్లాడుతా’ 1995 సినిమా కూడా సౌత్ లో మంచి హిట్ అందుకుంది. ఇక సంజయ్ దత్ నటించిన ‘ఖల్ నాయక్’ సినిమా నేరుగా హిందీలోనే విడుదలయి మంచి విజయం సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, శ్రీదేవి నటించిన ‘ఖుదాగావ’ కూడా హిట్ గా నిలిచింది. ఇక హృతిక్ నటించిన ‘కోయి మిల్ గయా, క్రిష్, అలాగే ధూమ్ సిరీస్’ కుడా మంచి విజయాన్ని నమోదు చేసాయి. ఇక డాన్, కల్ హో నా హో, డర్, లాగాన్, రంగ్ దే బసంతి, త్రీ ఇడియట్స్ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే…
నేటి జీవనశైలిలో మార్పులు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల…
వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎండలు పెరిగినప్పుడు శరీరంలో వేడి అధికమై అలసట, దాహం, మూత్ర…
సహజీవన సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత…
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…