ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అనారోగ్యం పాలవడంతో ఈరోజు()గురువారం) ఉదయం కన్నుమూశారు. రిషి కపూర్ ఆకస్మిక మరణంతో అయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో పలు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రిషి కపూర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా, కడసారి చూపుకోసం ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు రిషి కపూర్ ఇంటికి రావాలని భావిస్తున్నా కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండడం వల్ల కుదరని పరిస్థితి. మరోవైపు రిషి కపూర్ కుటుంబ సబ్యులకు ముంబై పోలీసులు తగు సూచనలు చేసారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కారణంగా అభిమానులు ఎవరు రిషి కపూర్ భౌతికకాయాన్ని చూడడానికి ఇంటికి రావొద్దని కోరుతున్నారు.
మరోవైపు నటుడిగా, నిర్మాతగా ఎంతో అత్యున్నత స్థాయిని అందుకున్న రిషి కపూర్ జీవితంలో కొన్ని వివాదాలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అవి ప్రస్తావించడం కరెక్టా? కదా? అనే విషయం పక్కన పెడితే బాలీవడ్ భామ సోనమ్ కపూర్ పెళ్ళిలో హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా అలీఖాన్ తో రిషి కపూర్ తప్పుగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. అది జరిగిన వెంటనే ఆ ఫంక్షన్ నుంచి రిషి కపూర్ వెళ్లిపోవడంతో ఈ వివాదానికి తేరపడింది. తరువాత రిషి కపూర్ భార్య నీతూ కపూర్ క్షమాపణలు కూడా చెప్పారు. ఒక సమయంలో మహారాష్ట్రలో బీఫ్ బ్యాన్ చేయడంపై రిషి కపూర్ స్పందిస్తూ “నాన్ సెన్స్” అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.
అంతేకాదు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తీర్పు తరువాత కపూర్స్ ఎల్లప్పుడూ ఖాన్స్ కు మద్దతుగా ఉంటారని తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఇది భారీ వివాదమే అయింది. అప్పట్లో ఈ విషయంపై బాలీవుడ్ లో పెద్ద రచ్చే జరిగింది. హాలీవుడ్ నటి కమ్ కర్దాషియన్ ను ఉల్లిగడ్డల బస్తా తో పోలుస్తూ మరో ట్వీట్ చేసారు. ఆ తరువాత ఆసిన్, రాహుల్ శర్మ ల పెళ్ళిలో రిషి కపూర్ గొడవ గొడవ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో రాహుల్ శర్మ సీరియస్ అవుతూ ఆ ఫంక్షన్ ను ఆపివేశారని, రిషి కపూర్ ను అక్కడి నుంచి పంపించేసి తిరిగి ఫంక్షన్ మొదలు పెట్టారనే వార్తలు ఉన్నాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…