Fighter: ఫైటర్ కోసం ఏకంగా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న దీపికా.. ఎన్ని కొట్లో తెలుసా?

Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా నటించిన చిత్రం ఫైటర్. ఈ సినిమా తాజాగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చుట్టూ తిరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి ఫైటర్ జెట్ మూవీ. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ని అందుకోవడంతో పాటు తొలిరోజే భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. హృతిక్ రోషన్ నటన, యాక్షన్ అద్భుతం. దీపికా పదుకొణె సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అనిల్ కపూర్ నటన కూడా అద్భుతంగా ఉందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేశభక్తి ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అంతే కాదు హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అందులో భాగంగానే ఈ సినిమా కోసం హృతిక్, దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫైటర్ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా అయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసింది. ఇప్పుడు ఫైటర్ కూడా 1000 కోట్లవరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్లతో నిర్మించినట్లు టాక్. ఫైటర్ మూవీ కోసం హృతిక్ ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేశారట.

దీపికా పారితోషికం అన్ని కోట్లు..

హీరోయిన్ దీపికా పదుకునే రూ.15 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. హృతిక్ బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి 50 కోట్ల తీసుకోవడం పెద్ద షాకింగ్ విషయం కాదు కానీ దీపికా పదుకొనె 15 కోట్లు తీసుకోవడం షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వామ్మో ఏకంగా దీపికా 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకు ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించడంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.