Sanjay dutt and drugs :సంజయ్ దత్ బాలీవుడ్ హీరో గా కంటే తన జీవితంలో జరిగిన నాటకీయా సంఘటనల వల్ల బాగా పాపులర్ అయ్యారు. డ్రగ్స్ తీసుకోవడం, బాంబు పేలుళ్ల కేసులో జైలుకి వెళ్లడం, ఇక క్యాన్సర్ తో పోరాడడం..ఇలా తన జీవితం లో చాలా జరిగాయి.ఇక డ్రగ్స్ కి ఎలా అలవాటు పడ్డారు, అసలు ఎందుకు డ్రగ్స్ తీసుకున్నారు లాంటి విషయాలను ఆయన ఇటీవలి ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. కేజీఎఫ్ లో అదీరాగా ఆయన నటన అందరిని ఆకట్టుకుంది.
అమ్మాయిల కోసం డ్రగ్స్….
అమ్మాయిలతో మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడినని,కానీ వాళ్ళతో మాట్లాడటం కోసం డ్రగ్స్ ను ఆశ్రయించానని డ్రగ్స్ తీసుకుంటే వారికి కూల్ గా కనిపిస్తానని అనుకునే వాడినని చెప్పుకొచ్చారు. ఇక అమ్మాయిలకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించే వాడినని చెప్పారు. ఇక డ్రగ్స్ ను వదలడానికి రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి తిరిగి తన జీవితాన్ని కొత్తగా మార్చుకున్నాడు సంజయ్. కానీ రిహబిలిటేషన్ సెంటర్ నుండి వచ్చాక అందరు తనను డ్రగ్గీ అనిపిలవడం మొదలుపెట్టారని ఇక ఆ మచ్చను పోగొట్టుకోవడానికి తాను బాడీ బిల్డింగ్ వైపుమరలానని చెప్పారు.అందరు ఆ తరువాత డ్రగ్గీ అన్నవాళ్లే మెచ్చుకోవడం ప్రారంభించారాని చెప్పారు.
ఇక 1993 ముంబై బాంబు కేసు విషయంలో సంజయ్ ఇంట్లో మారణాయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడంతో ఆయన జైలుకి వెళ్లారు.ఇక ఆ తరువాత క్యాన్సర్ భారిన పడి చికిత్స కోసం అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. ఇక కేజీఎఫ్ సినిమాలో అధీరగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఇక ఈయన జీవితాన్ని బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రణ్ భీర్ కపూర్ సంజయ్ గా లీడ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా సంజు గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…