Categories: FeaturedMovie News

Murali Mohan vs Krishna fans : కృష్ణ అభిమానులకు కోపం తెప్పించిన మురళీ మోహన్… అసలు ఏమి జరిగిందో తెలుసా…!

Murali Mohan shares interesting incident with Krishna fans : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ సుపరిచితులు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు.ఇటీవల ఆయన అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కృష్ణ గారి అభిమానులతో జరిగిన సంఘటనను వివరించారు.

కృష్ణ గారిని అలా చూపించొద్దు…అంటూ అభిమానుల గొడవ….

మురళీ మోహన్ గారూ, సూపర్ స్టార్ కృష్ణ గారు చదివేటపుడు క్లాస్ మేట్స్. అప్పటినుండి కృష్ణ గారితో పరిచయం ఉందట మురళీ మోహన్ గారికి. ఇక కృష్ణ గారు సినిమాల్లోకి రావడం ఆ తర్వాత సూపర్ స్టార్ అవ్వడం చక చక జరిగిపోయాయి. ఇక కృష్ణ, నాగార్జున కలయిక లో వారసుడు చిత్రాన్ని తీసినపుడు ఆ సినిమాలో నాగార్జున, తండ్రి కృష్ణను నిలదీసే సన్నివేశం లో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తారా స్థాయికి వెళ్లే సీన్ లో కృష్ణ, నాగార్జున నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వస్తారని ఇక ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు మా ఇంటి మీదకు గొడవకు వచ్చారని గుర్తు చేసుకున్నారు.

కొంతమంది అయితే నన్ను కొట్టడానికి కూడా వచ్చారని ఆయన అన్నారు. కృష్ణగారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడు? అలా అనడానికి వీల్లేదు.. ఆ సన్నివేశాన్ని ని తొలగించండి,లేకపోతే సన్నివేశాన్ని మార్చండి అంటూ మా ఇంటి ముందు గొడవకు దిగారని ఆయన అప్పటి సంఘటనను పంచుకున్నారు.సినిమా గురించి, సన్నివేశాల గురించి వివరించిన, వ్యక్తిగతంగా తీసుకోవద్దని చెప్పిన వారు వినలేదని అన్నారు.

ఇక కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆయన చాలా గొప్పవారని చాలా మంది నిర్మాతలను ఆదుకున్నారని, డబ్బులేదు సినిమా చేయలేమంటే అవన్నీ తరువాత ముందు సినిమా చేయండి అని వారికి ధైర్యం చెప్పేవారని మురళీ మోహన్ చెప్పారు.కృష్ణ గారిలాంటి గొప్ప వ్యక్తిని నేనింత వరకు చూడలేదంటూ ఆయన గురించి వివరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago