General News

Sad News: రిసెప్షన్ లోనే కుప్పు కూలిన పెళ్లి కూతురు..! ఏం జరిగిందంటే..!

Sad News: ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక మరుపురాని అనుభూతి. భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంది. తన పెళ్లి బంధు మిత్రులతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో ఆశపడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఒకవైపు తన కూతురు మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందని సంతోష పడుతుండగా.. మరోవైపు.. కూతురు తమను విడిచి అత్తగారింటికి వెళ్లిపోతుందోనని బాధ కూడా ఉంటుంది.

Sad News: రిసెప్షన్ లోనే కుప్పు కూలిన పెళ్లి కూతురు..! ఏం జరిగిందంటే..!

ఎన్ని రోజులు ఉన్నా ఆడపిల్ల వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్లక తప్పదు కదా. అయితే ఓ అమ్మాయి జీవితంలో మాత్రం ఇలా జరుగుతుందని తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఏం జరిగిందంటే.. కర్ణాటక రాష్ర్టంలోని శ్రీనివాసపురానికి తాలుకాకు చెందిన చైత్ర కైవార కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది.

Sad News: రిసెప్షన్ లోనే కుప్పు కూలిన పెళ్లి కూతురు..! ఏం జరిగిందంటే..!

ఈమెకు ఇటీవల హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెలలోనే పెళ్లి చేయడానికి పెద్దలు ముహూర్తాలు కూడా ఫిక్స్ చేశారు. కానీ అనుకోకుండా ఆమెను మృత్యువు వెంటాడింది. పెళ్లికి ముందు రోజు రిసెప్షన్ పెట్టారు. ఆ రిసెప్షన్కు బంధువులు, స్నేహితులందరూ హాజరయ్యారు.


వెంటనే ఆమె తల్లిదండ్రులు ..

అప్పటివరకు అక్కడి ఉన్నవారంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ పెళ్లి కూతురు చైత్ర సడన్ గా రిసెప్షన్ లోనే కుప్పకూలి కిందపడిపోయింది. అప్పటివరకు మంచిగానే ఉన్న చైత్రకు ఏమైందో తెలియక అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమె తల్లిదండ్రులు హుటహూటిన చికిత్స కోసం బెంగుళూరులో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. చైత్రకు ఆరు రోజులుగా వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. ఆ మాట విన్న ఆమె తల్లిదండ్రులు అక్కడికక్కడే నేలకొరిగి బోరున విలపించారు. డాక్టర్ల విజ్ఞప్తి మేరకు తమ కూతురి అవయవాలు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago