Categories: Political News

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఆరోపణలు.. ₹5 లక్షల వాచ్, ₹1 లక్ష బూట్లు హాట్ టాపిక్

ఆలేరు, తెలంగాణ: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రస్తుతం విలాస వస్తువుల వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ధరించిన ఒక వాచ్, బూట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను బీఆర్‌ఎస్ పార్టీ నేతలు విస్తృతంగా షేర్ చేస్తూ, ఐలయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

₹5 లక్షల వాచ్, ₹1 లక్ష బూట్లు

ఐలయ్య ధరించిన వాచ్ విలువ ₹5 లక్షలు అని, బూట్ల ధర ₹1 లక్ష అని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. “ఒక్కసారి ఎమ్మెల్యే అయిన ఐలయ్య, ఐదేళ్లు పూర్తికాకముందే ఇంత ఆస్తి ఎలా సంపాదించాడు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీములు ఈ పోస్టులను విస్తృతంగా పంచుతూ, ఐలయ్యపై అవినీతి ఆరోపణల దాడిని మరింత పెంచాయి.

కాంగ్రెస్ కౌంటర్

అయితే, కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. “ఎమ్మెల్యే ఐలయ్య ఎదుగుదలను గులాబీ పార్టీ తట్టుకోలేక ఇలా ఆరోపణలు చేస్తోంది. ఒక బీసీ యాదవ బిడ్డను టార్గెట్ చేస్తూ, దొరల రాజకీయాలు ఆడుతున్నారు” అంటూ వారు మండిపడుతున్నారు. ఈ వివాదం ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విలాస వస్తువుల ఫోటోలు నిజమేనా, లేక రాజకీయ ప్రపగాండా మాత్రమేనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago