2020 సంవత్సరంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే కేంద్రం అనేక నిర్ణయాలను తీసుకున్నా ఆ నిర్ణయాలు అంత సానుకూల ఫలితాలను ఇవ్వలేదు.
దీంతో కేంద్రం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్, లీవ్ ట్రావెల్ కన్సీషన్ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. కన్సూమర్ స్పెండింగ్‌ను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్స్ ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
ఈ రెండు స్కీమ్ ల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు డబ్బులు పొందవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సీషన్ స్కీమ్ ద్వారా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు నగదు పొందే అవకాశం ఉంటుంది. టికెట్ ధరకు మూడు రెట్లు డబ్బులను, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద ఉద్యోగులు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఎల్‌టీసీ పొందడానికి కేంద్రం ఛాన్స్ కల్పిస్తోంది.
స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పది వాయిదాల్లో పది వేల రూపాయలను చెల్లించే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కేంద్రం ఈ ఆఫర్లను ప్రకటించింది. కేంద్రం 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు 50 సంవత్సరాల కాలపరిమితితో అందించనుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…