ఎల్‌పీజీ వినియోగదారులలో ఇటీవలి కాలంలో కేవైసీపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అందరూ తప్పనిసరిగా eKYC చేయాల్సిందే అన్న ప్రచారం నిజం కాదని, ఇప్పటివరకు ధృవీకరణ పూర్తి చేయని వారికి మాత్రమే ఇది అవసరమని తెలిపింది.
పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానం పూర్తి చేసిన ఎల్‌పీజీ వినియోగదారులు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు మాత్రమే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులు, వార్తలు అన్ని ఎల్‌పీజీ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో ప్రజల్లో అనవసర గందరగోళం ఏర్పడింది. దీనిపై స్పందించిన మంత్రిత్వ శాఖ, ఆ ప్రచారాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వం లక్ష్యం వినియోగదారులను కేవలం అవగాహన కల్పించడం మాత్రమేనని, ఎక్కువ మంది తమ ఆధార్ ధృవీకరణ పూర్తి చేసుకునేలా ప్రోత్సహించడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇది కొత్త నిబంధన కాదని, ఇప్పటికే అమల్లో ఉన్న ప్రక్రియలో భాగమేనని వివరించింది.
ఎల్‌పీజీ సబ్సిడీలు, ఇతర సేవలు సజావుగా అందుకునేందుకు కేవైసీ పూర్తి చేయడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు ఆలస్యం చేయకుండా సమీప గ్యాస్ ఏజెన్సీ వద్ద లేదా అధికారిక మార్గాల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు
దక్షిణాది సంగీత ప్రపంచంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనిరుధ్ రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే వరుస…
దివంగత నటి శ్రీదేవికు సంబంధించిన ఆస్తి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమె కుటుంబానికి మద్రాస్ హైకోర్టు…
క్రికెట్ అభిమానులను ప్రతి ఏడాది అలరించే ఐపీఎల్లో భారీ సిక్సర్లు, రికార్డులు సహజం. ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి.…
సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రముఖ నటి రేణు…
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గాయని తాజాగా ఓ…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సినీ నటీమణుల పేర్లు అనవసరంగా చర్చకు రావడం వివాదానికి దారితీసింది. ప్రముఖ నటి, లేడీ సూపర్…