Shivaji: సినీ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించారు. అలాగే హీరో ఫ్రెండ్ పాత్రలలో కూడా ఈయన నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శివాజీ రాజకీయాల గురించి కూడా తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
గతంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడినటువంటి ఈయన అనంతరం ఆయనను ద్వేషించారు అయితే తీరా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మరోసారి చంద్రబాబు నాయుడుని గెలిపించాలి అంటూ ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ఈయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటమే కాకుండా ఆయన జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనని పెట్టిన చిత్రహింసల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జైలులో చంద్రబాబు నాయుడుని చాలా చిత్రహింసలు పెట్టారని తెలిపారు. ఆయన వయసు 74 సంవత్సరాలు ఎముకల కొరకే చలిలో కూడా చంద్రబాబు నాయుడుని దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. నాకు తెలిసినటువంటి ఒక కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు జైలులో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి తెలిపారని శివాజీ వెల్లడించారు.
చన్నీటి స్నానం చేశారు..
ఓ మాజీ ముఖ్యమంత్రి..15ఏళ్లు ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రికి. ఇండియన్ కమెుడ్ ఇచ్చారు. ప్రస్తుత రోజులలో ఇండియన్ కమెుడ్ వాడటం మానేసి వెస్ట్రన్ కమెుడ్ వాడుతున్నారు. 74 ఏళ్ల వయసున్న వ్యక్తి జైలుకు వస్తే వెస్ట్రన్ కమెుడ్ తీసేసి ఇండియన్ కమెుడ్ ఇచ్చారని ఆరోపించారు. ఎముకలు కొరికే చలి ఉండగా చంద్రబాబు నాయుడు స్నానానికి చల్లనీలను ఇస్తూ ఎన్నో హింసలు పెట్టారని ఇలాంటి దారుణమైనటువంటి ఈ పరిస్థితులు మారాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలంటూ ఈయన అందరికీ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…