Movie News

Charmme Kaur: అప్పుడు నవ్వి ఇప్పుడు నవ్వుల పాలైన చార్మి.. అడ్డంగా దొరికిపోయిన నటి భారీగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!

Charmme Kaur: కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎగిరి పడితే తిరిగి కాలమే మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. అందుకే ఎలాంటి సమయంలోనైనా అనిగిమనిగి ఉండడం మంచిదని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు నటి చార్మి. లైగర్ సినిమా విడుదల అనంతరం ఛార్మికి సంబంధించిన ఒక పాత ట్వీట్ ద్వారా ఈమె అడ్డంగా దొరికిపోవడంతో మెగా అభిమానులు చార్మిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

గతంలో మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా గురించి నటి చార్మి, ట్విట్టర్ ద్వారా కామెంట్ చేస్తూ క్లాప్స్ కొట్టడమే కాకుండా నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ఇలా ఈమె ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా ఒకప్పుడు రామ్ చరణ్ సినిమాలు చూసిన నవ్విన ఛార్మి ప్రస్తుతం తన లైగర్ సినిమాతో నవ్వుల పాలయ్యింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైజర్ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సమస్థ 200 కోట్లు ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసినట్లు స్వయంగా చార్మి చెప్పడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున ట్రోల్ చేయడమే కాకుండా అప్పట్లో రామ్ చరణ్ సినిమా గురించి చేసిన ట్వీట్ గురించి ప్రస్తుతం మెగా అభిమానులు చర్చిస్తూ చార్మిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Charmer Kaur: ఆడుకుంటున్న మెగా ఫాన్స్…

ఒకప్పుడు తమ హీరో సినిమా ఫ్లాప్ అయితే నవ్విన ఈమె ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో నవ్వుల పాలు అయిందంటూ భారీగా చార్మిని ట్రోల్ చేస్తున్నారు.అసలే సినిమా ఫ్లాప్ కావడంతో బాధలో ఉన్నటువంటి వీరిపై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ మాత్రం పుండు పై కారం చల్లిన విధంగా గతంలో వీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారీగా చిత్ర బృందంపై ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఇలాంటి టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్ అభిమానుల సైతం ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago