Political News

Chavi Reddy: జగనన్న ఇచ్చిన స్వేచ్ఛను గుర్తుపెట్టుకో వాసన్నా… బాలినేని పై చెవిరెడ్డి కామెంట్స్!

Chavi Reddy: సెకీ విద్యుత్ ఒప్పందం గురించి వైకాపా మాజీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి కాడ జగన్ గారు అందరిని సంతకాలు చేయమని కోరారని బాలినేని ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు కురిపించడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఇలా ఇద్దరు మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.

ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకితో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం చాలా బాధాకరం. మీరు కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం దిగజారిపోయి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక ఈయన చంద్రగిరి నుంచి పోటీ చేయడం పట్ల కూడా బాలినేని తప్పుపట్టారు.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్‌ కల్యాణ్‌) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. నేను మీలాగా విలువలు లేని రాజకీయాలు చేయలేదు నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి వైయస్సార్ గారికి అభిమానిని ఇప్పటివరకు కూడా నేను అదే పార్టీలో కొనసాగుతున్నాను ఇకపై పార్టీ కూడా మారను.

Chavi Reddy: జగన్ ను ఇబ్బంది పెట్టారు..

మన పార్టీలో జగనన్న మీకు ఇచ్చిన స్వేచ్ఛను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఇతర పార్టీ నేతలతో కలిసి రష్యాకు ఇతర విదేశాలకు వెళ్లినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అభ్యంతరం చెప్పలేదు. అదే ఇప్పుడు కనుక మీరు ఇతర పార్టీ నేతలతో స్పెషల్ ఫ్లైట్లో వేరే దేశాలకు వెళ్లి రండి మీరు తిరిగి ఫ్లాట్ దిగి వచ్చేలోపు చంద్రబాబు నాయుడు మీ పదవి ఊడగొడతాడు. జగనన్నను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించారు. ఇప్పుడు కూడా తనపై అసత్యపు ప్రచారాలు చేసిన ధైర్యంగా ఎదుర్కొంటాము ఏదో ఒక రోజు మీకు జగనన్న ఇచ్చిన స్వేచ్ఛ తప్పక గుర్తుకొస్తుంది అంటూ చెవిరెడ్డి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago