ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల ఆయన మరణించారన్న వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో, తాను క్షేమంగా ఉన్నానని స్పష్టం చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
పర్యాటక ప్రాంతంలో చిత్రీకరించిన ఈ వీడియోలో నెతన్యాహు సాధారణ ప్రజల మధ్య కనిపిస్తూ, వారితో మాట్లాడటం గమనార్హం. యుద్ధ పరిస్థితుల మధ్య ప్రజల్లో నమ్మకం పెంచేలా ఆయన ఈ వీడియో ద్వారా సందేశం ఇవ్వాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన మరో వీడియోపై కృత్రిమ మేధ సహాయంతో రూపొందించారన్న అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించిందన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక కాఫీ దుకాణంలో కూర్చొని తన చేతిని చూపిస్తూ సరదాగా స్పందించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘ఇదిగో చూడండి, నా చేతికి ఐదు వేళ్లే ఉన్నాయి’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.
అయితే, ఆ వీడియో కూడా కృత్రిమ మేధతో రూపొందించబడిందనే సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా వీడియోను విడుదల చేస్తూ నెతన్యాహు మళ్లీ ప్రజల ముందుకు రావడం విశేషంగా మారింది. ఈసారి ఆయన కొండ ప్రాంతంలో సందర్శకులతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందిస్తూ, దేశం ఐక్యంగా ముందుకు సాగుతోందని, చివరికి విజయమే సాధిస్తామని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఆయన విడుదల చేస్తున్న వీడియోల నిజాసత్యాలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…