Featured

Child artist Shresta : చిరంజీవి ఇష్టం అని అన్నందుకు… మోహన్ బాబు నేలకేసి కొట్టాడు…: చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ

Child Artist Shresta : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమర సింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి శ్రేష్ఠ. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్ళు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన శ్రేష్ఠ ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అయితే ఆ సినిమాలో నటించిన శ్రేష్ఠ ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

చిరంజీవి ఇష్టం అన్నందుకు.. మోహన్ బాబుకి కోపం వచ్చింది…

శ్రేష్ఠ ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మంది హీరోలతో చేసినా తన అభిమాన నటుడు చిరంజీవి అంటూ చెప్పారు. ఆయనతో హిట్లర్ సినిమాలో నటించినపుడు, వన్ టేక్ లో చేసేస్తావు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వి నువ్వు అని ప్రశాంసించారట. అది లైఫ్ లో మర్చిపోలేనంటూ చెప్పిన శ్రేష్ఠ తనకు మెమరీగా ఉన్న మరో సంఘటన తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి నాకు అభిమాన నటుడు అని చెప్తే ఆ జర్నలిస్ట్ పత్రికలో చిరంజీవి మాత్రమే నాకు నచ్చుతాడు మరెవరూ నచ్చరు అనే అర్థం వచ్చేలా హెడ్డింగ్ పెట్టి ఆర్టికల్ రాసారు.

అది చదివిన మోహన్ బాబు గారు మేజర్ చంద్ర కాంత్ షూటింగ్ అపుడు నాముందు ఆ పేపర్ ను సెట్లో ఉండే ఉయ్యాల మీద గట్టిగా నేలకేసి కొట్టి నువ్వు నా సినిమాలో చేస్తూ చిరంజీవి మాత్రమే ఇష్టం అని చెప్తావా వేరే హీరోలెవరూ నచ్చరని చెబుతావా అని అరిచారు. నేను అలా చెప్పలేదని చెప్తే నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎలా రాస్తారు అంటూ అన్నారు. కాసేపటికి ఆయనే నవ్వారు అది ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. నేనొకటి చెబితే పత్రికల వాళ్ళు అలా రాశారు అంటూ శ్రేష్ఠ తన అనుభవాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

11 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

11 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

11 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

12 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

12 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

12 hours ago