General News

భూకంపం రాకుండానే ఊగిపోయిన 71 అంతస్థుల భవనం.. చివరికి?

సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు భూమిలో ప్రకంపనలు మొదలై చిన్న ఇంటి నుంచి ఎత్తయిన భవనాలు వరకు ఊగుతుంటాయి. భూకంపం తీవ్రతను బట్టి భవనాలు కోల్పోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది.కానీ తాజాగా చైనాలో మాత్రం ఎటువంటి భూకంపం లేకుండా ఎంతో ఎత్తయిన భవనం లో ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఎంతో తీవ్ర భయాందోళన చెంది భవనం నుంచి బయటకు పరుగులు తీశారు.

చైనాలో ఎత్తైన భవనాల్లో ఒకటైన సెగ్ ప్లాజా అకస్మాత్తుగా అటూ ఇటూ ఊగడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై భవనాన్ని ఖాళీ చేయించారు. భూకంపం రావడం వల్లే భవనం కదులుతుందని పరుగులు తీసిన జనాలు బయట ఎటువంటి భూకంప పరిస్థితులు కనపడకపోవడంతో ఏం జరిగిందనే ఆలోచనలో పడ్డారు.

షెన్ జన్ నగరంలో ఉన్న సెగ్ ప్లాజా భవనం 356 అడుగుల ఎత్తున ఉంది. చైనా లోని అత్యంత ఎత్తైన భవనాలలో ఈ భవనం 21వ స్థానంలో ఉంది ఈ భవనంలో పది అంతస్తులలో షెన్ జన్ ఎలక్ట్రానిక్స్ గ్రూపులు ఉన్నాయి. మిగతా అంతస్థులలో ఐటీ సంస్థల ఆఫీసులో ఉన్నాయి. 2000 సంవత్సరంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనంలో ఉన్నఫలంగా ప్రకంపనలు రావడంతో అక్కడ ఉద్యోగులు ఎంతో ఆందోళన చెంది బయటకు పరుగులు తీశారు.

ఈ భవనంలోని ప్రకంపనల గురించి అధికారులకు తెలియజేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని తిరిగి భవనంలోకి ఎవరు ప్రవేశించకుండా భవనానికి సీజ్ చేశారు. ‘‘దేశంలోని అన్ని ఎర్త్‌కేక్ మానిటరింగ్ స్టేషన్ల నుంచి వివరాలు సేకరించాం. కానీ, ఎక్కడా భూకంపాలు ఏర్పడలేదని తెలిసింది. అయితే ఈ భవనంలో మాత్రమే ప్రకంపనలు రావడానికి గల కారణం ఏమిటని విచారణ చేపట్టారు. ఈ భవనంలో మాత్రమే ప్రకంపనలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

10 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

10 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

10 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

10 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

10 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

13 hours ago