ఈ మధ్య కాలంలో మన సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియాలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.ఒక్కసారి సెలెబ్రెటీలను ఉద్దేశించి పలు పోస్ట్ లు చేస్తుంటారు. ఐతే అలా వాళ్ళు కామెంట్ చేసినప్పుడు పోస్టు చేసినవారు గమనించకపోవడం.. చాలా కాలం తర్వాత చూసి.. అరెరెరే.. గమనించలేకపోయానే అని నాలుక్కరుచుకొని రిప్లే ఇవ్వడం కూడా చేస్తుంటారు కొందరు. అయితే.. సాధారణ జనాలు.. సాధారణ విషయాల్లో అయితే.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. సెలబ్రిటీలు.. ప్రముఖమైన విషయాలు అయితే మాత్రం.. అదో న్యూస్ కూడా అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కాజల్ విషయంలో ఇదే జరిగింది.
గౌతమ్ కిచ్లును గతేడాది అక్టోబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత ఎవ్రీ డే ను జాలీడేగా ఎంజాయ్ చేస్తోంది. కాజల్ సంసార జీవితంలోకి అడుగు పెట్టడంతో సహచరులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల్లో ముంచెత్తారు. అప్పట్లో ఈ అమ్మడి పెళ్లి వార్తలు దాదాపు వారంపాటు సీరియల్ గానే సాగాయి. అందరూ గ్రీటింగ్స్ చెప్పడం.. వాళ్లు ధన్యవాదాలు చెప్పడం కూడా అయిపోయాయి. కానీ.. ఒక్కరికి మాత్రం బాకీ పడిపోయింది చందమామ. కాజల్ పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే ట్విటర్ లో ఓ పోస్టు చేసింది స్వీటీ అనుష్క. వైవాహిక జీవితానికి సంబంధించిన పెద్ద కొటేషన్ రాసిమరీ.. కాజల్ కు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు.. ఈ పోస్టుకు కాజల్ ను కూడా ట్యాగ్ చేసింది. అయితే.. ఆ పోస్టుకు లైక్ కొట్టడమో.. రిప్లే ఇవ్వడమో కూడా చేయలేదు కాజల్. పెళ్లయిన దాదాపు 7 నెలల తర్వాత కాజల్ రిప్లే ఇవ్వడం విశేషం. లవ్ సింబ్ పెట్టి, థాంక్స్ చెప్పింది.
ఇక, నెటిజన్లు ఎందుకు ఆగుతారు..? అమ్మడిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. రిటైర్మెంట్ లేకుండా సెటైర్లు దూసుకొస్తున్నాయి. ‘ఇప్పుడే ఎందుకు రిప్లే ఇచ్చావమ్మా.. పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తే బాగుండేది కదా’ అంటున్నారు కొందరు. ‘ఓ ఐదు మాసాలు అయితే.. మ్యారేజ్ డే వస్తుంది కదా.. అప్పుడు చెప్తే బాగుండేది’ అంటున్నారు ఇంకొందరు.మరికొందరు మాత్రం ‘ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబితే పోయేది గౌరవంగా ఉండేది కదా.. ఇంత కాలం తర్వాత ఇలా రిప్లే ఇవ్వడం ఏమీ బాగలేద’ని అంటున్నారు ఇంకొందరు. నిజమే కదా.. చూసుకోలేదనో, ఇంకా వేరే కారణం ఏమైనా ఉంటే అది చెప్పో.. థాంక్స్ చెబితే బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..!!
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…