Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి తాజాగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు.గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన రోజే నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందిందని ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలియచేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలు వారి అభిమానుల గురించి కూడా మాట్లాడారు సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని తెలియజేశారు.తన సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టే వాడినని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలియజేశారు.

Chiranjeevi: ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా…

ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు కూడా చేశారు. అయితే నేనెప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.