Chiranjeevi – Madhavi : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.
1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు.
కథలోకి వస్తే..
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.
1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్,కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో,హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం. చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.
ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. “ఖైదీ” సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. “రోషగాడు” విజయవంతమై “సింహపురి సింహం” పరాజయం పొందింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…