Chiranjeevi – Madhavi : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.
Advertisement
1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. కథలోకి వస్తే..
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.
1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్,కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో,హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం. చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.
ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. “ఖైదీ” సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. “రోషగాడు” విజయవంతమై “సింహపురి సింహం” పరాజయం పొందింది.
Murali Sharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటుడుగా ఎంతో మంచి గుర్తుంటే సంపాదించుకున్న వారిలో మురళి శర్మ ఒకరు. ఈయన సినిమాలో ఒక పాత్రకు కమిట్ అయ్యారంటే ఆరు నూరైనా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.
Advertisement
ఇలా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మురళి శర్మ భార్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిన ఈయన భార్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ విలన్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి మురళి శర్మ భార్య ఎవరు ఏంటి ఆమె ఏ సినిమాలలో నటించారు అనే విషయానికి వస్తే…
మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాలో విలన్ కంటే ఎక్కువ హైలేట్ అయింది అశ్వినీనే. అంతేకాకుండా నిప్పు సినిమాలో ప్రదీప్ రావత్ భార్యగా లేడీ విలన్‌గా నటించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అశ్వినీ కల్‌శేఖర్… మరోవైపు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మురళీ శర్మ. ఇక ఈ మొదటి సినిమాకి ఈయన నంది అవార్డు అందుకున్నారు. ఇలా ఈ భార్యాభర్తలిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటీనటులు అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
Star Heroin: సాధారణంగా హీరో హీరోయిన్లు ఒకసారి కెమెరా ముందుకు వచ్చారు అంటే వారిని వాళ్ళు మర్చిపోయి వారు నటించే పాత్రలో లీనం అవుతూ నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్టర్లు షాట్ ఓకే చెప్పినా కూడా వాళ్లు మాత్రం అదే పాత్రలోనే ఉండిపోతుంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తన పాత్రలో లీనమౌతూ ఒక హీరోయిన్ కు లిప్ కిస్ పెడుతూ ఉండిపోయారు. పెదవుల నుంచి రక్తం కారుతున్న కూడా ఆయన వదిలిపెట్టలేదు.
Advertisement
మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరు ఏంటీ అనే విషయానికి వస్తే… ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిన నటి మాధురి దీక్షిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గురించి ఈతరం వారికి తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈమె కనుక సినిమాలో కనిపించింది అంటే సినిమా హిట్ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది.
క్షమాపణలు చెప్పిన హీరో.. ఇలా ఈమె క్రేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఈమె కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంది అయితే ఈ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా హీరో ఈ సన్ని వేషంలో లీనం అయిపోయి ఆమె పెద్దవి గట్టిగా కొరికారట రక్తం వస్తున్న కూడా వదలలేదని,ఈ దెబ్బతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా అలా వినోద్ ఖన్నా పెదవి కొరికేయడంతో ఏడ్చుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అనంతరం డైరెక్టర్ తో పాటు హీరో కూడా ఆమెకు క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.
Star Hero: సాధారణంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఎంతో మారం చేస్తారు. స్కూల్ కి వెళ్లకుండా ఉండడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే ఒక స్టార్ హీరో కూడా ఇలా స్కూల్ కి వెళ్లకుండా చిన్నప్పుడు ఎన్నో దేశాలు వేసేవారని తెలుస్తోంది. ఇలా స్కూల్ కి వెళ్లకుండా ఉండటం కోసం ఈ స్టార్ హీరో చేసిన పని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
Advertisement
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇతర భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హీరోగా ఒకానొక సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అమితాబ్ బచ్చన్ వేల కోట్లలో ఆస్తులను సంపాదించారు.
వేలకోట్లకు అధిపతి.. ప్రస్తుతం కరోడ్‌పతి 16వ సీజన్‌ను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఒక్కో షోకి ఆయన రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. ఈ షోలో భాగంగా ఆయన తన బాల్యం గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ బయటపెట్టారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాలి అనిపించకపోతే ఉల్లిపాయలు తీసుకుని చంకలో పెట్టుకునే వాణ్ణి. ఇలా చేయటం వల్ల ఒళ్ళు మొత్తం వేడి అయ్యేది అప్పుడు ఇంట్లో వాళ్ళు జ్వరం వచ్చింది అని నన్ను స్కూల్ కి పంపించే వాళ్లు కాదు అంటూ ఎవరికి తెలియని ఈ సీక్రెట్ చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.