C.M.Kcr: నోరూరిస్తున్న గులాబీ దోసే… ఎగబడుతున్న జనం… ఎక్కడంటే?
C.M.Kcr: మీకు ఇష్టమైన టిఫిన్ ఏది అంటే చాలామందికి దోసే అని చెబుతారు. ఇలా దోసెలో ఎన్నో వెరైటీలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇలా దోసేలో ఉన్న రకాలు గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుంది. ఇప్పటివరకు చాలా మంది ఆనియన్ దోసె, మసాలా దోసె, పన్నీర్ దోసె వంటి వాటి గురించి మన వినే ఉంటాం… కానీ మీరు ఎప్పుడైనా గులాబీ దోసే గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
గులాబీ దోసే అంటే గులాబీలతో తయారుచేసింది కాదండోయ్…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గా ఈ గులాబీ రంగుతో తయారు చేయించిన దోసె కేవలం ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారు. దోసే గులాబీ రంగులో రావడం కోసం బీట్ రూట్ కలిపి ఈ దోసెను ఒక్క రూపాయికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో లభిస్తుంది.
పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విధమైనటువంటి దోశలు తయారు చేయించి కేవలం ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారు పార్టీ జెండా రంగులో ఉన్న ఈ దోశను తినడానికి ఎంతో మంది ఎగబడ్డారు.
ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా గులాబీ రంగులో ఈ దోసే ఉండడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పార్టీ జెండా రంగులో దోశ ఉండటంతో ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో పై పలువురు విభిన్న రకాలు అకౌంట్లో చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…